ENG vs IND : భారత్‌తో మూడో టెస్టు.. కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌కు పెద్ద సవాలే..
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ENG vs IND 3rd test Ben Stokes toughest challenge as captain
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఓ పొరబాటు జరిగిందిన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంగీకరించాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కెప్టెన్సీ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా.. జూలై 10వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌కు పెద్ద సవాల్ అని మాజీ ఆటగాడు మైకేల్ అథర్టన్ అన్నాడు.
‘ఓ కెప్టెన్‌గా లార్డ్స్ టెస్టు బెన్‌స్టోక్స్‌కు ఎంతో కీలకం. ఈ కీలక మ్యాచ్ నేపథ్యంలో అతడు ప్రస్తుతం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్ అతడి కెప్టెన్సీ పటిమ, మానసిక, శారీరక సామర్థ్యానికి పరీక్ష కానుంది.’ అని అథర్టన్ చెప్పాడు. ఇక రాబోయే రెండు రోజులు అతడికి చాలా ముఖ్యం అని తెలిపాడు.
Prithvi Shaw : ఇక నా లైఫ్ మారుతుంది.. పృథ్వీ షా హాట్ కామెంట్స్.. ముంబైను వీడి మహారాష్ట్రను చేరి..
ఎందుకంటే తొలి, రెండో టెస్టుకు మధ్య ఏడు రోజుల విరామ సమయం దొరికింది. కానీ రెండు, మూడో టెస్ట్ మధ్య మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పుంజుకోవడం బెన్‌స్టోక్స్‌కు ఎంతో కీలకం అని చెప్పాడు.
తుది జట్టులో వారిద్దరికి చోటు ఇవ్వాలి..
లార్డ్స్ టెస్ట్ తుది జట్టులో ముఖ్యంగా రెండు మార్పులు తప్పనిసరిగా ఉండాలని మైకేల్ అథర్టన్ సూచించాడు. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్ స్థానంలో గస్ అట్కిన్సన్‌లను జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పై తనకు నమ్మకం ఉందన్నాడు.