Nikhat Zareen: సత్తాచాటిన తెలంగాణ యువ బాక్సర్.. జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ విజేతగా నిఖత్ జరీన్

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటింది. ఆరవ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది.

Nikhat Zareen: సత్తాచాటిన తెలంగాణ యువ బాక్సర్.. జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ విజేతగా నిఖత్ జరీన్

Nikhat Zareen

Updated On : December 26, 2022 / 2:45 PM IST

Nikhat Zareen: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటింది. ఆరవ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. తద్వారా 2022వ ఏడాదిని ఘనంగా ముగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ వేదికగా జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో నిఖత్ జరీన్ సత్తాచాటింది.

Nikhat Zareen: బాలీవుడ్ కండల వీరుడుతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన భారతీయ బాక్సర్..

50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ ప్రత్యర్థి అనామిక (రైల్వేస్)పై 4-1 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. ప్రారంభం నుంచి ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చివరి వరకు నిఖత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదు రౌండ్లలో కేవలం చివరి రౌండ్ లో మాత్రమే అనామిక పైచేయి సాధించింది.

 

నిఖత్ 2022 కామన్వెల్త్ గేమ్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిళ్లను గెలుచుకున్న విషయం విధితమే. ఇదిలాఉంటే 6వ ఎలైన్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ నెగ్గడం పట్ల తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.