Nikhat Zareen: బాలీవుడ్ కండల వీరుడుతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన భారతీయ బాక్సర్..
నిఖత్ జరీన్.. భారతీయ లేడీ బాక్సర్. ఇటీవల జరిగిన 2022 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఈ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచింది. అంతకంటే ముందు 2011లో అంటాల్యలో జరిగిన AIBA మహిళల యూత్ అండ్ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో కూడా బంగారు పతకాన్ని సాధించింది. బాక్సింగ్ రింగ్ లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జరీన్, తన అభిమాన హీరో సల్మాన్ ని కలిస్తే చాలు...

Indian boxer Nikhat Zareen did an Instagram reel with a Bollywood hero Salman Khan
Nikhat Zareen: నిఖత్ జరీన్.. భారతీయ లేడీ బాక్సర్. ఇటీవల జరిగిన 2022 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఈ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచింది. అంతకంటే ముందు 2011లో అంటాల్యలో జరిగిన AIBA మహిళల యూత్ అండ్ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో కూడా బంగారు పతకాన్ని సాధించింది.
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అనారోగ్యం..
బాక్సింగ్ రింగ్ లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జరీన్.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని. లైఫ్ లో ఒక్కసారైనా తన అభిమాన హీరోని కలిస్తే చాలు అనుకున్న జరీన్ ఏకంగా సల్మాన్ తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసింది. సల్మాన్ సూపర్ హిట్ మూవీ ‘లవ్’ సినిమాలోని “సతియా తూనే క్యా కియా” సాంగ్ కి ఇద్దరు కలిసి రీల్ చేశారు.
“ఎట్టకేలకు నా కల నెరవేరింది” అంటూ జరీన్ ఆ రీల్ కి కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా సల్మాన్ ప్రెజెంట్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్, జగపతిబాబు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సల్మాన్ తో కలిసి చిందేశాడట.