Nitish Kumar Reddy : తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సూపర్ బ్యాటింగ్.. పాట్ కమ్మిన్స్, హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్ బౌలర్ల దాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపడుతున్నానితీశ్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు.

Nitish Kumar Reddy : తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సూపర్ బ్యాటింగ్.. పాట్ కమ్మిన్స్, హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy with Pat Cummins : ఐపీఎల్ 2024 సీజన్ లో మంగళవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగిపోయాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలర్ల దాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపడుతున్నానితీశ్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా 37 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులతో 64 పరుగులు చేశాడు. నితీశ్ దూకుడైన బ్యాటింగ్ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేయగలిగింది.

Also Read : బౌండరీల మోతమోగించిన తెలుగు కుర్రాడు.. స‌న్‌రైజ‌ర్స్‌ను గెలిపించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

నితీశ్ రెడ్డి బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ అదరగొట్టాడు.. మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి నితీశ్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శన సన్ రైజర్స్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. నితీశ్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనపై సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ మాట్లాడుతూ.. నితీశ్ రెడ్డి అద్భుతం, ఫెంటాస్టిక్ ప్లేయర్. గత వారంలోనే ఈ సీజన్ లో అరంగ్రేటం చేశాడు. ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వెళ్లాడు. ఫీల్డింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. నితీశ్ రెడ్డి బ్యాట్ తో విజృంభించి జట్టు స్కోర్ ను 182 పరుగులకు చేర్చడం గొప్ప విషయమని కమ్మిన్స్ అన్నాడు.

Also Read : IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

టీమిండియా ప్లేయర్ హనుమ విహారి నితీశ్ కుమార్ రెడ్డిపై ఎక్స్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తుదపరి సూపర్ స్టార్ అంటూ కొనియాడారు. నితీశ్ రెడ్డి కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చాడు. కొడుకును క్రికెటర్ గా తీర్చిదిద్దడం కోసం నితీశ్ తండ్రి ఉద్యోగం మానేశాడు. తండ్రి మార్గదర్శకత్వంలో నితీశ్ నికార్సయిన క్రికెటర్ గా తయారయ్యాడని హనుమ విహారి చెప్పాడు. నితీశ్ పడ్డ కష్టానికి ఫలితం లభించింది. నితీశ్ రెడ్డికి 17ఏళ్ల వయస్సు నుంచి నేను చూస్తున్నా.. అతడు ఓ క్రికెటర్ గా ఎదిగిన తీరు గర్వంగా అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, భవిష్యత్తులో టీమిండియాకు అతడు విలువైన ప్లేయర్ గా మారతాడు అంటూ నితీశ్ రెడ్డిపై హనుమ విహారీ ప్రశంసల జల్లు కురిపించాడు.