Nitish Kumar Reddy : ఇదేం విచిత్రమో.. కొడుకు ఎస్ఆర్‌హెచ్ ప్లేయ‌ర్‌.. తండ్రి ఆర్‌సీబీ ఫ్యాన్‌..! పిక్ వైర‌ల్‌..

నితీశ్‌కుమార్ రెడ్డి తండ్రికి సంబంధించిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Nitish Kumar Reddy father in RCB jersey during his gym session

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సి ప‌ని లేదు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేశాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో శ‌త‌కంతో స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌ ఐపీఎల్ మెగావేలం 2025 ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు రూ.6 కోట్ల‌కు నితీశ్ రెడ్డిని రిటైన్ చేసుకుంది. అయితే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఈ ఆట‌గాడు అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాడు. ఆల్‌రౌండ‌ర్ అయిన అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో బ్యాట‌ర్‌గానే బ‌రిలోకి దింపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 21.17 స‌గ‌టు 113.43 స్ట్రైక్‌రేటుతో 152 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు.

Rajasthan Royals : అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజ‌స్థాన్ ఔట్‌.. కోల్‌క‌తా, పంజాబ్ ల‌కు కొత్త క‌ష్టం..!

అటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌ద‌ర్శ‌న కూడా ఈ సీజ‌న్‌లో ఏమంత గొప్ప‌గా లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మ‌రో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -1.103గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్థానంలో కొన‌సాగుతోంది.

ఈ సీజ‌న్‌లో మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ స‌న్‌రైజ‌ర్స్ భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు వ‌చ్చి చేర‌తాయి. అప్పుడు ప్లేఆఫ్స్ చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

కాగా.. నితీశ్‌కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటోలో జిమ్ చేసేట‌ప్పుడు ఆర్‌సీబీ జెర్సీ ధ‌రించి ముత్యాల రెడ్డి క‌నిపించారు.

Vaibhav Suryavanshi-Sunil Gavaskar : అయ్యో.. సునీల్ గ‌వాస్క‌ర్ చెప్పిన‌ట్లే జ‌రిగిందే.. ఇప్పుడు 14 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ భ‌విష్య‌త్ పై ఆందోళ‌న‌?

ప్రస్తుతం ఈ పిక్ వైర‌ల్ అవుతోంది. కాగా.. ముత్యాల రెడ్డి ఆర్‌సీబీ ఫ్యాన్ అని తెలుస్తోంది. ఇక కొడుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నప్ప‌టికి అత‌డు ఆర్‌సీబీ జెర్సీలో క‌నిపించ‌డంతో నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు. భ‌విష్య‌త్తులో నితీశ్ రెడ్డి ఆర్‌సీబీ త‌రుపున ఆడ‌నున్నాడు అని అంటున్నారు. అటు నితీశ్ రెడ్డికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అన్న సంగ‌తి తెలిసిందే.

RR vs MI : ఏందిరా అయ్యా.. అంపైర్లు చూడ‌లేదా? లేదా చూసినా వ‌దిలేశారా? రోహిత్ శ‌ర్మ డీఆర్ఎస్ కాంట్ర‌వ‌ర్సీ.. వీడియో వైర‌ల్‌

ఇదిలాఉంటే.. ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడ‌గా 7 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ +0.521గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది.