RR vs MI : ఏందిరా అయ్యా.. అంపైర్లు చూడలేదా? లేదా చూసినా వదిలేశారా? రోహిత్ శర్మ డీఆర్ఎస్ కాంట్రవర్సీ.. వీడియో వైరల్
రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. వరుసగా ఆరో విజయాన్ని సాధించింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టేందుకు మరింత చేరువైంది. అదే సమయంలో ముంబై చేతిలో ఓడిపోవడంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్ర్కమించింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంపైర్లు ముంబై ఇండియన్స్‌కు ఫేవర్‌గా వ్యవహరించారని కొందరు ఆరోపిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ను గెలిపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను ఫజలక్ ఫరూఖీ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూ అంటూ రాజస్థాన్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంటనే రోహిత్ మరో ఓపెనర్ రికెల్టన్‌తో చర్చించాడు. ఆఖరికి రివ్య్వూ తీసుకున్నాడు.
వాస్తవానికి డీఆర్ఎస్ తీసుకోవడానికి నిర్దిష్టంగా 15 సెకన్ల సమయమే ఉంటుంది. ఆలోపే రివ్య్వూ తీసుకోవాలి. ఆ సమయం దాటిన తరువాత రివ్య్వూ కోరినప్పటికి దానిని అంపైర్లు పరిగణలోకి తీసుకోరు. అయితే.. రోహిత్ శర్మ రివ్య్వూ కోరిన సమయంలో టైమర్ జీరోగా కనిపించింది. కాగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ దీన్ని పట్టించుకోలేదు. థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు.
కాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది.
RCB fans, forget it, Umpire Indians are fully prepared to win the final with the help of the umpires. BCCI is sitting silently while open fixing is happening. Shame on Mumbai Indians and their team.#MIvsRR #RohitSharma pic.twitter.com/Csf4J0k746
— Priyanshu Verma (@iPriyanshVerma) May 1, 2025
అయితే.. అంపైర్ల తప్పిదం కారణంగానే రాజస్థాన్ రాయల్స్‌కు నష్టం జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై అనగానే వాళ్లు రూల్స్ మరిచిపోతారని, ఎలాగైనా ఆ జట్టును విజేతగా నిలపాలని చూస్తారని ఆరోపిస్తున్నారు.