RR vs MI : హార్దిక్ నీ కమిట్‌మెంట్‌కు సలామ్.. కంటి పైభాగంలో ఏడు కుట్లు పడినా మైదానంలోకి.. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదుర్స్..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (53; 36 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ (48; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (48 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు మెరుపులు మెరిపించారు. ఆర్ఆర్ బౌలర్లలో మహేశ్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడింది. 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఆర్ఆర్ బ్యాటర్లలో జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ చెరో మూడు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్ల పడగొట్టాడు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
కంటికి గాయం.. !
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషల్ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది. ఏడు కుట్లు పడ్డాయి.
CAPTAIN HARDIK PANDYA:
– 7 stitches above his left eye while training.
– Decided to play the match.
– Scored 48* (23) with the bat.
– Picked 1/2 with the ball.THE COMMITMENT OF THE CAPTAIN! pic.twitter.com/zOlD0TcNQI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2025
అంత గాయమైనా కూడా విశ్రాంతి తీసుకోకుండా మ్యాచ్ ఆడాలని హార్దిక్ నిర్ణయించుకున్నాడు. గాయం దగ్గర వైట్ టేప్ వేసుకుని, కంటికి కళ్లజోడు పెట్టుకుని మరి మ్యాచ్ ఆడాడు. కెప్టెన్ కమిట్ మెంట్‌ను చూపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టును గెలిపించుకున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు ముంబై ఇండియన్స్ జట్టు పట్ల హార్దిక్‌కు ఉన్న కమిట్‌మెంట్ అర్థమవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
రాజస్థాన్ పై విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.