No 3 spot cant be a musical chairs game says Aakash Chopra
IND vs SA : కోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తుది జట్టు ఎంపిక పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు తుది జట్టులో స్థానం కల్పించకపోవడాన్ని చాలా మంది తప్పు బడుతున్నారు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. మూడో స్థానంలో ప్రయోగాలు చేయడం తగదన్నాడు. ‘ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ మూడో స్థానంలో ఆడాడు. ఆ తరువాత వెస్టిండీస్‌తో సిరీస్‌లో సాయి సుదర్శన్ ఆడాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా పై వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తున్నారు. ఆ తరువాత అభిమన్యు ఈశ్వర్వన్‌ను ఆడిస్తారేమో.’ అంటూ ఆకాశ్ చోప్రా విమర్శించారు.
ఢిల్లీలో సాయి సుదర్శన్ ఆడిన ఇన్నింగ్స్ విషయంలో సంతృప్తి లేనప్పుడు అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించాడు. జట్టులో 15 మంది ఉండాలి కాబట్టి సాయి సుదర్శన్ ను తీసుకోవడం సబబు కాదన్నాడు. అతడి మీద విశ్వాసం లేనప్పుడు ఎలా తీసుకుంటారు అని సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకాశ్ చోప్రా ప్రశ్చించాడు.
ద్రవిడ్, పుజారా తరువాత..
రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారా తరువాత మూడో స్థానంలో ఆడే సరైన బ్యాటర్‌ను ఇప్పటి వరకు టీమ్ఇండియా కనుగొనలేకపోయింది. ఈ స్థానంలో కొన్నాళ్లు శుభ్‌మన్ గిల్ ఆడాడు. అయితే.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకగానే.. అతడు ఆడే నాలుగో స్థానంలో గిల్ వస్తున్నాడు.
Kuldeep Yadav : పెళ్లి చేసుకుంటానయ్యా.. సెలవు ఇవ్వండి.. బీసీసీఐకి కుల్దీప్ యాదవ్ రిక్వెస్ట్.. !
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ మూడో స్థానంలో ఆడినా అతడు ఘోరంగా విఫలం అయ్యాడు. ఇక సాయి సుదర్శన్ విషయానికి వస్తే.. అతడు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో ఆడాడు. 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు.