2021 IPL ఆడతాడా? : ధోనీ రిటైర్మెంట్ ప్లాన్‌పై రవిశాస్త్రి క్లారిటీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై జట్టు కోచ్ రవిశాస్త్రీ క్లారిటీ ఇచ్చాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసే సమయం ఇప్పట్లో లేదన్నాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ తీసుకునే సమయం చాలా దూరంలో ఉందని, 2021 ఎడిషన్ ఐపీఎల్ వరకు మిస్టర్ కూల్ ఆడతాడని శాస్త్రి స్పష్టం చేశాడు.
‘ధోనీ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు. ఐపీఎల్ సమయంలో ఎలా ఆడుతున్నాడు అనేదంతా ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నమెంట్ ధోనీకి చివరి టోర్నమెంట్ కానుంది. ఆ తర్వాత ధోనీ కొనసాగుతాడా లేదా అనేది వచ్చే టీ20 వరల్డ్ కప్ నిర్ణయిస్తుంది’ అని శాస్త్రి చెప్పాడు. ఇంగ్లండ్ లో 50 ఓవర్ల ప్రపంచ కప్ టోర్నీ జరిగినప్పటి నుంచి ధోనీ ఆడటం లేదు. అంటే.. రాబోయే ప్రపంచ మ్యాచ్‌ల్లో ఆడేందుకు ధోనీ సిద్ధమవుతున్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
చివరి టీ20 కాదు.. ఫ్యాన్స్‌కు పండుగే :
అదేగానీ నిజమైతే ధోనీ అభిమానులకు ఇక పండుగే. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 2020 ఐపీఎల్ టోర్నీ ధోనీకి చివరి మ్యాచ్ కాదనే విషయం తెలిసిపోతోంది. మాజీ కెప్టెన్ ధోనీ ఇప్పటికే తాను 2020 ఎడిషన్ IPL ఆడతానని తన ఫ్రాంచైజీ యజమాన్యానికి చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
‘2021 ఐపీఎల్‌కు ముందు వేలం జరుగనుంది. ఇదివరకే టోర్నీలో ఆడతానని ధోనీ మాకు చెప్పేశాడు. టీ20 నుంచి ధోనీ త్వరలో రిటైర్మెంట్ అవుతాడనే ప్రశ్న ఇక లేనే లేదు’ అని CSK వర్గాల సమాచారం. 2021 సీజన్ ఐపీఎల్ వేలానికి ధోనీని వెళ్లకుండా చూడాలని సీఎస్ కే భావిస్తోంది. మరోవైపు ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అంటే.. ఇప్పట్లో ధోనీ రిటైర్మెంట్ ప్రస్తావన లేదని తెలిసిపోతోంది. ప్రస్తుతం ధోనీ 2020 IPL పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
CSKలో సీనియర్లు.. ఎవరికి ఆఖరిదో :
మరోవైపు.. ధోనీ ఏం చేస్తున్నాడు. అతడి ఆలోచన ఏంటి అనేదానిపై కూడా జట్టు యాజమాన్యానికి తెలియడం లేదు. కానీ, అది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు కూడా. ఒకవేళ ధోనీకి మంచి ఐపీఎల్ ఉంటే.. 2020 టీ20 ప్రపంచ కప్‌లో తప్పకుండా భాగమవుతాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2020 ఎడిషిన్ తర్వాత CSK జట్టును పునర్మించడంలో ధోనీ సాయం ఎంతో అవసరమని యాజమాన్యం భావిస్తోంది. CSK జట్టులో హర్భజన్ సింగ్, షేన్ వాట్సాన్, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహీర్ వంటి ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉన్నారు.
వీరిలో 2020 ఎడిషన్ ఏ క్రికెటర్ కు చివరిది అవుతోందో చూడాలి. 2021 ఐపీఎల్ తర్వాతే ధోనీ రిటైర్మెంట్ అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వస్తుంది. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఎల్లప్పడూ CSKకు మెంటర్ గా వ్యవహారిస్తాడనడంలో సందేహం లేదంటున్నాయి క్రికెట్ వర్గాలు. ధోనీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్ కు ఎప్పుడు ముగింపు పలుకుతాడో కాలమే నిర్ణయిస్తుంది.