PIC: @IPL (X)
వైభవ్ సూర్యవంశీ.. ఎనిమిదో తరగతి విద్యార్థి.. అతడి వయసు 14 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి, తొలి మ్యాచులోనే 20 బంతుల్లో 34 పరుగులు బాదిన ఫేమస్ అయిపోయాడు. 14 ఏళ్ల వయసులో ఇంతటి పాపులారిటీ తెచ్చుకోవడం అంటే అంత సులువేం కాదు.
అయితే, గతంలోనూ చిన్న వయసులోనే పాపులర్ అయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. 14 మరియు 17 సంవత్సరాల మధ్య ప్రజాదరణ పొందిన కొందరు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 15-16 ఏళ్ల వయసులోనే పాపులారిటీ సంపాదించారు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆయన అరంగేట్రం 15 సంవత్సరాల వయస్సులోనే జరిగింది. రంజీ ట్రోఫీలో అరంగేట్రంలోనే సెంచరీ బాదారు.
అనంతరం సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో అంతర్జాతీయ టెస్ట్‌లో అరంగేట్రం చేశారు. 1989, నవంబర్‌లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఆడారు. దీంతో అప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు. అంత చిన్న వయసులోనే అతని ప్రతిభను క్రికెట్ దిగ్గజాలతో పోల్చారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా 14 ఏళ్ల వయసులోనే పాపులారిటీ సంపాదించారు. 1996లో 14 సంవత్సరాల వయస్సులో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. అయితే, ఆయన వయసు విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి.
Also Read: ఎనిమిదో తరగతి పిల్లాడు ఐపీఎల్‌లో ఆడొచ్చా? మరి సూర్యవంశీ ఎలా ఆడాడు?
అఫ్ఘానిస్థాన్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహమాన్ 16 ఏళ్ల వయసులోనే పాపులారిటీ సంపాదించాడు. 16 సంవత్సరాల వయస్సులో ఆఫ్ఘానిస్థాన్ తరఫున వన్డేలలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత U-19 ప్రపంచ కప్, ఐపీఎల్‌లో తన మిస్టరీ స్పిన్ బౌలింగ్‌తో పేరు తెచ్చుకున్నాడు.
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా 14-15 ఏళ్ల వయసులోనే పాపులర్ అయ్యాడు. 14 సంవత్సరాల వయస్సులో ముంబైలో జరిగిన స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో 546 పరుగులు చేశాడు. 2013, నవంబర్‌లో హారిస్ షీల్డ్ మ్యాచ్‌లో రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ తరఫున ఆడుతున్నప్పుడు పృథ్వీ షా 330 బంతుల్లో 546 పరుగులు బాదాడు.
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ 15 ఏళ్ల వయసులోనే పాపులర్ అయింది. 2019లో 15 సంవత్సరాల వయసులో టీమిండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసింది.
అఫ్ఘానిస్థాన్ క్రికెటర్ నూర్ అహ్మద్ 14-15 ఏళ్ల వయసులోనే పాపులర్ అయ్యారు. 14 సంవత్సరాల వయసులో లంక ప్రీమియర్ లీగ్‌లోకి ప్రవేశించారు. ఇప్పుడు అతడి వయసు 20. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నాడు.