ODI World Cup 2023: నిన్ను వదలం..! నవీన్-ఉల్-హక్ ను మరోసారి ర్యాగింగ్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. వీడియో వైరల్

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాడు నవీన్-ఉల్-హక్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం జరిగింది. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ..

ODI World Cup 2023: నిన్ను వదలం..! నవీన్-ఉల్-హక్ ను మరోసారి ర్యాగింగ్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. వీడియో వైరల్

Virat Kohli Vs Naveen Ul Haq (File Photo)

Virat Kohli Vs Naveen Ul Haq : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం క్రికెట్ పై అవగాహన ప్రతీఒక్కరికి తెలిసిందే. అప్పటి నుంచి నవీన్ కనిపించినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేస్తూ ర్యాగింగ్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా శనివారం ఆఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో ఆప్గాన్ పై బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Naveen Ul Haq

Naveen Ul Haq

ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ సమయంలో ఆ జట్టు ఫేసర్ నవీన్ ఉల్ హక్ మైదానంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టేడియంలోని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. నవీన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు అభిమానులు కోహ్లీ కోహ్లీ అని అరుస్తూ ర్యాగింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అభిమానులు కోహ్లీ నామస్మరణ చేస్తున్నా నవీన్ ఉల్ హక్ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటున్నట్లు కనిపించాడు.

Virat Kohli Vs Naveen Ul Haq

Virat Kohli Vs Naveen Ul Haq

అసలు గొడవ ఏమిటంటే?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాడు నవీన్-ఉల్-హక్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం జరిగింది. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీతో నవీన్ ఉల్ హక్, గంభీర్ గొడవకు దిగిన విషయం విదితమే. నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ తో ఘర్షణ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంబీర్ కూడా రావడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో విరాట్, గంభీర్ లకు 100శాతం, నవీన్ కు 50శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. వీరి మధ్య సోషల్ మీడియాలోనూ మాటల యుద్ధం కొనసాగింది. దీంతో నవీన్ ఉల్ హక్ కనిపించినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ ిలాంటి ఘటన చోటు చేసుకుంది. దీన్నిబట్టిచూస్తుంటే నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ వదిలేలా కనిపించడం లేదు.