Tokyo Olympics 2020: కండోమ్ వాడకం దగ్గర్నుంచి.. నీరజ్ తో పాటు కెమెరా మాన్ పరుగు వరకూ ఒలింపిక్ 2020లో వైరల్ మూమెంట్స్

టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020లో 206దేశాలు 14రోజుల పాటు పాల్గొని ఆదివారంతో మెగా శిబిరాన్ని పూర్తి చేశాయి. గేమ్స్ కొందరిని హీరో చేస్తూ మరికొందరు దుఖ సాగరంలో టోర్నీని వీడారు. పట్టుదలతో బరిలోకి దిగిన ప్లేయర్ల యుక్తులు, వారిని కవర్ చేయడానికి సిబ్బంది పడిన పాట్లు వైరల్ అయిపోయాయి.

Tokyo Olympics 2020: కండోమ్ వాడకం దగ్గర్నుంచి.. నీరజ్ తో పాటు కెమెరా మాన్ పరుగు వరకూ ఒలింపిక్ 2020లో వైరల్ మూమెంట్స్

Olympic Moments

Updated On : August 9, 2021 / 8:03 PM IST

Tokyo Olympics 2020: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020లో 206దేశాలు 14రోజుల పాటు పాల్గొని ఆదివారంతో మెగా శిబిరాన్ని పూర్తి చేశాయి. గేమ్స్ కొందరిని హీరో చేస్తే మరికొందరు దుఖ సాగరంలో టోర్నీని వీడారు. పట్టుదలతో బరిలోకి దిగిన ప్లేయర్ల యుక్తులు, వారిని కవర్ చేయడానికి సిబ్బంది పడిన పాట్లు వైరల్ అయిపోయాయి.

కండోమ్ వాడకం:
ఆస్ట్రేలియాకు చెందిన కెనోయిస్ట్ (పడవ నడిపే పోటీదారు) జెస్సికా ఫాక్స్ ఒలింపిక్స్ లో ఇష్యూ చేసి కండోమ్ తో తన పడవను రిపేర్ చేసకుంది. K1 మహిళల ఈవెంట్ లో ఈ ఫీట్ జరిగింది. దానిని రిపేర్ చేసుకుని పోటీని తిరిగి ప్రారంభించిన ఆమె కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు.

కండోమ్ ను ఇలా కూడా వాడొచ్చని తెలుసా.. అంటూ ఫొటోను పోస్టు చేసి ఇలా క్యాప్షన్ ఇచ్చారు.

నీరజ్ తో పాటు కెమెరామన్
ఇండియాకు నీరజ్ చోప్రా స్వర్ణం అందించిన క్షణం.. అతణ్ని చేజ్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది కెమెరామన్ కు. ఈ క్రమంలో ముందు ఉన్న ఫెన్సింగ్ ను కూడా దూకుతూ వెళ్లిపోయాడు. ఈ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హృదయాలు గెలిచిన బ్రిటన్ గర్ల్స్:
రీసెంట్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ ప్లేయర్ల ప్రదర్శనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒలింపిక్స్ లో స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేశారు. కాంస్య పతక పోరులో ఓడిపోయిన క్షణం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. బ్రిటన్ గర్ల్స్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన ఓ మూమెంట్ మాత్రం అద్భుతం.

గోల్డ్ పంచుకున్న మిత్రులు
ఖతర్ కు చెందిన ముతాత్జ్ బర్షీం.. ఇటలీకి చెందిన గియాన్మార్కో తంబేరీ ప్లేయర్లు ఒలింపిక్ గోల్డ్ పంచుకున్నారు. హై జంప్ లో ఇద్దరూ ఒకే రికార్డు సాధించడంతో విన్నర్ ను ప్రకటించడానికి కాసేపు తలలు పట్టుకున్నారు జడ్జిలు. సడెన్ గా బర్షీం గోల్డ్ ను ఇద్దరూ పంచుకోవడం కుదురుతుందా.. అని అడగడంతో సరే అనేశారు.

స్విమ్మర్ నోటి నుంచి వచ్చేసిన బూతు
ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ కేలీ మెక్ కోవన్ ఒలింపిక్ 100మీ బ్యాక్స్ స్ట్రోక్ లో గోల్డ్ గెలుచుకున్నారు. అదే సమయంలో మైక్ ముందు మాట్లాడటానికి వచ్చి మాట్లాడుతుండగా ఫ.. అనే మాటను అనేశారు. వెంటనే రియలైజ్ అయి సరిచేసుకునే ప్రయత్నం చేశారు.

సవితా పూనియా.. శ్రీజేశ్
మ్యాచ్ తర్వాత సవితా పూనియా, శ్రీజేశ్‌ల ఫొటోలను చూస్తే వేల మాటలైనా వారి గురించి చెప్పలేం. ఇండియన్ హాకీ టీం కన్నీటిపర్యంతం కావడం బ్రిటన్ కు కాంస్యా రావడం, మరొకటి పురుషుల హాకీటీం గోల్ కీపర్ శ్రీజేశ్ అసాధారణ ప్రదర్శన.