Pakistan Cricket Team: ఆసియా కప్‌ టోర్నీకి ముందు పాకిస్థాన్ అభిమానులకు శుభవార్త .. అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన పాక్ ..

ఆసియా కప్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ అష్రఫ్ హర్షం వ్యక్తం చేశారు.

Pakistan Cricket Team

Pakistan Cricket: ఈనెల చివరి నుంచి ఆసియా కప్-2023 టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభంకు ముందే పాకిస్థాన్ జట్టు అభిమానులకు శుభవార్త చెప్పింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్ జట్టుపై పాకిస్థాన్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు అగ్రస్థానంకు చేరుకుంది. అంతకుముందు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంకు పడిపోయింది. పాకిస్థాన్ జట్టు 118 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా జట్టుకూడా 118 పాయింట్లతో ఉంది. అయితే, ఆస్ట్రేలియా జట్టు కంటే 0.48 పాయింట్లు పాకిస్థాన్ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి.

Asia Cup 2023 : ఆసియాక‌ప్ ప్రారంభానికి ముందు క‌రోనా క‌ల‌క‌లం.. టోర్నీకి కొవిడ్ ముప్పు..?

వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా 113 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓడిపోవడం భారత జట్టు ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. ఈ ఏడాది మార్చి తరువాత భారత్ కేవలం ఒకేఒక్క వన్డే సిరీస్ ఆడింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్ జట్లు వరుసగా నాలుగు నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య సెప్టెంబర్  2న మ్యాచ్ జరుగుతుంది.

Asia Cup 2023 : వాళ్లు అదృష్ట‌వంతులు.. అశ్విన్ గురించి చ‌ర్చ వ‌ద్దు.. న‌చ్చ‌క‌పోతే మ్యాచులు చూడ‌కండి

ఇదిలాఉంటే ఆసియా కప్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ అష్రఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం మా ప్రతిభావంతులైన ఆటగాళ్లు ప్రదర్శించిన కృషి అని అన్నారు. జట్టు అంకితభావం, ఐక్యతను ప్రతిబింభిస్తుందని కొనియాడారు. పాకిస్థాన్ జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానంను కైవసం చేసుకోవడం సంతోషకరమని అష్రఫ్ అన్నారు. క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జెండాను ఉన్నతంగా ఎగురవేయడానికి  జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది ప్రయత్నాలను అభినందిస్తున్నానని అష్రఫ్ చెప్పారు.