WTC 2023-25: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ లాస్ట్ ప్లేస్.. భారత్ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో పది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు ఏడు విజయాలతో 74.24శాతంతో ..

Pakistan Team
ICC World Test Championship 2023-2025: సొంత గడ్డపై పాకిస్థాన్ ఘోర పరాజయాలను ఎదురు చూస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఓడిపోయి టెస్టు సిరీస్ ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులోనూ ఓడిపోయింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ర్యాంకు దిగజారిపోయింది.
Also Read: PAK vs ENG : సొంతగడ్డపై పాకిస్థాన్‌కు బిగ్‌షాక్.. టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు
ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముందువరకు 19.05 శాతంతో ఎనిమిదవ ప్లేస్ లో ఉన్న పాక్.. తాజాగా 16.67 శాతంతో తొమ్మిదో ప్లేస్ కు పడిపోయింది. డబ్ల్యూటీసీ 2023 -25 సీజన్ లో పాకిస్థాన్ ఎనిమిది టెస్టు మ్యాచ్ లు ఆడింది. కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. మిగిలిన ఆరు ఓడిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో పది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు ఏడు విజయాలతో 74.24శాతంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 62.50శాతంతో రెండో స్థానంలో, శ్రీలంక జట్టు 55.56శాతంతో మూడో స్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ జట్టు 45.59శాతంతో నాల్గో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు 17 మ్యాచ్ లు ఆడగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచి.. ఏడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది.
WTC POINTS TABLE…!!! 🇮🇳
– Pakistan slips to the last position now! pic.twitter.com/wSUshHYrxT
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024