Pakistan win first home Test in 1350 days as they beat England in 2nd Test
PAK vs ENG 2nd Test : ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టు సొంత గడ్డపై టెస్టు మ్యాచులో విజయాన్ని అందుకుంది. దాదాపు మూడున్నర ఏళ్ల తరువాత పాకిస్థాన్ స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలిచింది. దీంతో స్వదేశంలో వరుసగా 11 టెస్టుల్లో గెలుపులేని పేలవ రికార్డుకు బ్రేక్ పడింది. ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 152 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లోల బెన్ స్టోక్స్ (37), బ్రైడన్ కార్సె (27), ఓలీ పోప్ (22) ఫర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో నొమన్ అలీ ఎనిమిది వికెట్లతో ఇంగ్లాండ్ భరతం పట్టగా సాజిద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో పాకిస్థాన్ మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.
36/2తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 108 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు నోమన్ అలీ, సాజిద్ ఖాన్ లు ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 20 వికెట్లను కూడా ఈ ఇద్దరు స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఏడు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. నొమన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు సాధించాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచులో ఇద్దరు బౌలర్లు 20 వికెట్లు తీయడం ఇది ఏడో సారి మాత్రమే. సాజిద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Asia Cup 2024 : శనివారం భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 366 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ 291 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్‌కు కీలకమైన 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 221 చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 297 పరుగుల విజయలక్ష్యం నిలవగా 144 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటైంది.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ సొంతగడ్డపై చివరి సారి 2021లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. అప్పటి నుంచి ఆడిన మ్యాచుల్లో ఒక్కదానిలోనూ విజయం సాధించలేదు. తాజాగా ఇంగ్లాండ్ పై విజయాన్ని సాధించింది.
Winning moments 📸
Pakistan beat England by 1️⃣5️⃣2️⃣ runs 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/AxAQX89cse
— Pakistan Cricket (@TheRealPCB) October 18, 2024