Mohsin Naqvi : క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన పీసీబీ చీఫ్.. ప్రేక్షకులు రావొచ్చు గానీ.. కండీషన్స్ అప్లై..
పీఎస్ఎల్ లో నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) శుభవార్త అందించారు
PCB Chairman Mohsin Naqvi confirms fans will be allowed to attend the PSL 2026 final
- నేటి నుంచి పీఎస్ఎల్లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు
- ప్రేక్షకులకు అనుమతి
- ఫ్యాన్స్ లేకుండానే లీగ్ దశ మ్యాచ్‌లు
Mohsin Naqvi : పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో నేటి (ఏప్రిల్ 28) మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) శుభవార్త అందించారు. ప్లే ఆఫ్స్ మ్యాచలకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే.. జాతీయ పొదుపు చర్యలకు అనుగుణంగా మ్యాచ్‌లకు హాజరయ్యేటప్పుడు ఫ్యాన్స్ ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు.
David Miller : మ్యాచ్ ఓడిపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చాలా వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పీఎస్ఎల్ 2026 లీగ్ దశ మొత్తం ప్రేక్షకులు లేకుండానే జరిగింది. ఆరు నగరాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. కేవలం రెండు వేదికలు లాహోర్, కరాచీలకు మాత్రమే పరిమితం చేశారు.
తాజాగా ప్లే ఆఫ్స్‌కు కొన్ని గంటల ముందే ప్రేక్షకులను అనుమతించే విషయం పై నిర్ణయం తీసుకున్నారు. ఇక నేడు కరాచీ వేదికగా జరగనున్న క్వాలిఫయర్‌లో పెషావర్ జల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్‌తో తలపడుతుంది.
బుధవారం లాహోర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్, హైదరాబాద్ కింగ్స్ పోటీపడనున్నాయి. శుక్రవారం ఇదే వేదికపై క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మే 3) న జరగనుంది. ఈ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
