PCB Take Big Call For Sri Lanka T20I Series No Babar Rizwan And Shaheen Afridi
SL vs PAK : వచ్చే నెలలో పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య లంకతో పాక్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే పాక్ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులలో కూడిన బృందంలో పాక్ సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, హారిస్ రౌప్, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిది సహా పలువురికి చోటు దక్కలేదు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టునే పాక్ ప్రకటించింది.
సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో పాక్ బరిలోకి దిగనుంది. దేశవాళీ క్రికెట్‌లో హిట్టర్‌గా పేరుగాంచిన ఖవాజా నఫే కు తొలిసారి జాతీయ జట్టులో దక్కింది. శస్త్రచికిత్స కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
Yashasvi Jaiswal : 15 రోజుల ముందే జైస్వాల్‌కు ఆ విషయాన్ని చెప్పేసిన రోహిత్ శర్మ.. అందుకే అలాగా..
ఇదిలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్నారు. వీరు పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీలంక, పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
శ్రీలంక, పాక్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – జనవరి 7న
* రెండో టీ20 మ్యాచ్ – జనవరి 9న
* మూడో టీ20 మ్యాచ్ – జనవరి 11న
SA20 : సరదాగా మ్యాచ్ చూసేందుకు వెళితే.. కోటి రూపాయలు.. నీది మామూలు అదృష్టం కాదు సామీ..
శ్రీలంకతో టీ20లకు పాక్ జట్టు ఇదే..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.