Yashasvi Jaiswal : 15 రోజుల ముందే జైస్వాల్‌కు ఆ విషయాన్ని చెప్పేసిన రోహిత్ శర్మ.. అందుకే అలాగా..
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
Jaiswal Was Informed By Rohit About His Debut 15 Days In Advance
Yashasvi Jaiswal : టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం (2023లో) డొమినికాలోని రోజౌలో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 49.23 సగటుతో 2511 పరుగులు చేశాడు.
కాగా.. ఈ యువఆటగాడి అరంగ్రేటం సంబంధించిన ఆసక్తికర విషయాలను స్వయంగా అతడే వెల్లడించాడు. తన ఎదుగుదల వెనుక టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంత ఉందో వెల్లడించాడు జైస్వాల్.
మామూలుగా అయితే.. మ్యాచ్ కు ఒకటి లేదా రెండు రోజుల ముందు అరంగ్రేటం చేస్తున్నావు అని ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ లేదా కెప్టెన్లు తెలియజేస్తుంటారు. అయితే.. యశస్వి జైస్వాల్ విషయంలో మాత్రం రోహిత్ శర్మ ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఒకటి కాదు నాలుగు కాదు ఏకంగా పదిహేను రోజుల ముందు నువ్వు అరంగ్రేటం చేస్తున్నావు అని చెప్పాడు.
IND vs NZ : కివీస్‌తో వన్డే సిరీస్.. పంత్‌కు భారీ షాక్..! ద్విశతక వీరుడికి చోటు!
జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం టీమ్ఇండియా వెస్టిండీస్‌కు చేరుకున్న వెంటనే జైస్వాల్‌తో హిట్‌మ్యాన్ మాట్లాడాడు. ‘నువ్వు అరంగ్రేటం చేస్తున్నావని మ్యాచ్‌కు ఒక రోజు ముందు చెప్పి నిన్ను ఒత్తిడికి గురి చేయను. 15 రోజుల ముందే చెబుతున్నా. టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నావు. ఓపెనర్‌గానే బరిలోకి దిగనున్నావు. ఇందుకు మానసికంగా సంసిద్దంగా ఉండు.’ అని రోహిత్ అన్నట్లుగా జైస్వాల్ చెప్పాడు.
‘ఇద్దరం కలిసి సాధన చేద్దాం, సరైన పద్దతిలో సిద్ధం అవ్వు. మైదానంలోకి వెళ్లిన తరువాత నీ సహజమైన ఆటను ఆడు. షాట్లు ఆడాలని అనిపిస్తే ఆడేసేయ్. అయితే.. ఒక్క విషయం.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మాత్రం దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చేందుకు ప్రయత్నించు.’ అని రోహిత్ శర్మ చెప్పాడని జైస్వాల్ వెల్లడించాడు.
SA20 : సరదాగా మ్యాచ్ చూసేందుకు వెళితే.. కోటి రూపాయలు.. నీది మామూలు అదృష్టం కాదు సామీ..
ఇక రోహిత్ శర్మ ఇచ్చిన ప్రోత్సాహంతో జైస్వాల్ తన తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 171 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక హిట్‌మ్యాన్ తనకు అన్నయ్య లాంటి వాడని జైస్వాల్ తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమన్నాడు. ఇక వారి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపాడు.
