SA20 : సరదాగా మ్యాచ్ చూసేందుకు వెళితే.. కోటి రూపాయలు.. నీది మామూలు అదృష్టం కాదు సామీ..
ఈ ఘటన సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్ ఆరంభ పోరులో (SA20) చోటు చేసుకుంది.
MI Cape Town vs Durban Super Giants Fan Gets more than one crore For Taking One Handed Catch In SA20 Contest
SA20 : ఇప్పుడు చెప్పబోయే క్రికెట్ ఫ్యాన్ ది మామూలు అదృష్టం కాదండి బాబు. సరదాగా అతడు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళితే కోటీ రూపాయలకు కంటే ఎక్కువ మొత్తాన్ని గెలుచుకున్నాడు. అది కూడా ఓ క్యాచ్ పట్టుకోవడం ద్వారా. ఇది నిజంగా నిజం అండి బాబు. ఈ ఘటన సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్ ఆరంభ పోరులో చోటు చేసుకుంది.
శుక్రవారం కేప్‌టౌన్ వేదికగా ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (64 ;33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా కేన్ విలియమ్సన్ (40; 25 బంతుల్లో 7 ఫోర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (35; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే రెండు వికెట్లు తీశాడు.
ఆ తరువాత 234 పరుగుల లక్ష్య ఛేదనలో ర్యాన్ రికల్టన్ (113; 63 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగగా, జాసన్ స్మిత్ (41; 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడినప్పటికి ఎంఐ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులకే పరిమితమైంది. డర్బన్ బౌలర్లలో ఈథన్ బోష్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్న ఫ్యాన్..
ఈ మ్యాచ్‌లో ఎంఐ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను డర్బన్ బౌలర్ క్వెనా మఫాకా వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతికి రికల్టన్ భారీ సిక్స్ బాదాడు. అయితే.. ప్రేక్షకుల్లో ఓ వ్యక్తి తన ఎడమ చేతితో ఆ బంతిని చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో అతడు 2 మిలియన్ల దక్షిణాఫ్రికా రాండ్ అంటే భారత కరెన్సీలో 1.07 కోట్లను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫ్యాన్ అందుకున్న క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నువ్వు నక్కతోక తోక్కావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
PV Sindhu : చీరకట్టులో పీవీ సింధు.. అచ్చమైన తెలుగింటి అమ్మాయి..
A guy in the crowd won 2M for taking the catch in SA20. 😄 pic.twitter.com/jYEaH4ZF7G
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2025
ఈ సీజన్‌లో ప్రేక్షకుల్లో క్యాచ్ అందుకున్న వారికి ఓ సంస్థ 2 మిలియన్ల దక్షిణాఫ్రికా రాండ్ లు అందిస్తోంది.
