ENG vs AUS : రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం.. 10 కాదు 20 కాదు 60 కోట్లకు పైగానే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ (ENG vs AUS ) రెండు రోజుల్లోనే ముగిసింది.
ENG vs AUS cricket australia huge loss after 4th test ends in two days
ENG vs AUS : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు పడగా రెండో రోజు 16 వికెట్లు నేలకూలాయి. కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో మెల్‌బోర్న్ పిచ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేయగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 42 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.
Steve Smith : మెల్‌బోర్న్‌లో మేమేందుకు ఓడిపోయామంటే.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కామెంట్స్..
ఈ మ్యాచ్‌లో పేసర్లు పండగ చేసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్ల తో పాటు మాజీలు నెటీజన్లు సైతం పిచ్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల దాడి ఓ వైపు కొనసాగుతుండగానే క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో గట్టి దెబ్బ పడింది. ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందట. మెల్‌బోర్న్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో దాదాపు 60 కోట్ల నష్టం వాటినట్లు స్కై స్పోర్ట్స్ నివేదించింది. టికెట్ల అమ్మకాలతో పాటు ప్రసార, ప్రకటనల ఆదాయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోయినట్లు పేర్కొంది.
మెల్‌బోర్న్‌కు ముందు పెర్త్‌లో కేవలం రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్ కారణంగా కూడా ఆస్ట్రేలియా కూడా గణనీయమైన ఆర్థిక నష్టాలను చవిచూసినట్లు పేర్కొంది.
Shubman Gill : రోహిత్, కోహ్లీ బాటలోనే గిల్.. కీలక నిర్ణయం..
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా పై విజయంతో ఇంగ్లాండ్ 14 సంవత్సరాల విజయ కరువును తొలగించింది. ఇంగ్లాండ్ చివరిసారిగా 2011లో ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించింది. ఈ విజయం తరువాత 14 ఏళ్లలో 18 మ్యాచ్‌లు ఆడినప్పటికి ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఇంకా 2010 తర్వాత ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే మొదటిసారి.
