Shubman Gill : రోహిత్, కోహ్లీ బాటలోనే గిల్.. కీలక నిర్ణయం..
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరం అయ్యాడు టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్.
Shubman Gill to play two Vijay Hazare Trophy matches to prepare for IND vs NZ series
Shubman Gill : ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరం అయ్యాడు టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్. పేలవ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా.. గాయం నుంచి అతడు కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అతడు స్వదేశంలో జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కన్నా ముందుగానే మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించకున్నట్లు సమాచారం.
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ ద్వారా కోహ్లీ, రోహిత్‌లు ఎంత సంపాదించారో తెలుసా?
దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్‌లు గిల్ (Shubman Gill) ఆడనున్నాడు. భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగానే ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు గిల్ సిద్ధం అవుతున్నాడు. ఇక అతడు తన సొంత టీమ్ అయిన పంజాబ్ తరుపున బరిలోకి దిగనున్నాడు.
వాస్తవానికి ఈ టోర్నీకి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యులు గల బృందంలో గిల్ ఉన్నాడు. అయితే.. పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు అతడు ఆడలేడు. దీంతో అతడు గాయం నుంచి కోలుకోలేదని, కివీస్‌తో సిరీస్‌లోనే నేరుగా ఆడతారని అంతా అనుకున్నారు.
Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీ20ల్లో ఏకైక కెప్టెన్..
అయితే.. గిల్ జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్‌లలో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు మొహాలీలో ఉండగా జనవరి 1న జైపూర్‌లో పంజాబ్ జట్టుతో కలవనున్నాడు.
