IND vs NZ : కివీస్‌తో వన్డే సిరీస్.. పంత్‌కు భారీ షాక్..! ద్విశతక వీరుడికి చోటు!
రిషబ్ పంత్ టెస్టులకే పరిమితం కానున్నాడా? జనవరిలో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో (IND vs NZ ) అతడికి చోటు కష్టమేనా?
Rishabh Pant To Be Dropped For New Zealand ODI Series Report
IND vs NZ : ఒకప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియాలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. అయితే.. టెస్టుల్లో అధ్భుతంగా రాణిస్తున్నప్పటికి కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే టీ20 జట్టుకు దూరమైన అతడు ఇక పై వన్డే జట్టులో కూడా చోటు కోల్పోనున్నాడా? అంటే అవుననే సమాధానామే వినిపిస్తోంది.
స్వదేశంలో జనవరి 11 నుంచి 18 వరకు భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును అతి త్వరలోనే సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. కివీస్‌తో తలపడే భారత జట్టులో రిషబ్ పంత్‌కు చోటు దక్కదని తెలుస్తోంది. అతడి స్థానంలో దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
SA20 : సరదాగా మ్యాచ్ చూసేందుకు వెళితే.. కోటి రూపాయలు.. నీది మామూలు అదృష్టం కాదు సామీ..
పంత్ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 31 వన్డేలు, 76 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 33.5 సగటుతో 871 పరుగులు, టీ20ల్లో 23.25 సగటుతో 1209 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 49 మ్యాచ్‌ల్లో 42.91 సగటుతో 3476 పరుగులు చేశాడు. పంత్ చివరి సారిగా వన్డేల్లో 2024 ఆగస్టులో శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికి కూడా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
అంతేకాదండోయ్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పంత్ భాగమైనప్పటికి కూడా అప్పుడు కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా పంత్‌ను ఆడించలేదు. వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ తుది జట్టులో భాగం అయ్యాడు. అతడికి బ్యాకప్‌గా మాత్రమే పంత్ ఉన్నాడు.
ఇషాన్ రీ ఎంట్రీ..?
ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. చివరి సారి అతడు 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తరువాత అతడు కొన్ని కారణాల వల్ల జట్టుకు దూరం అయ్యాడు. అయితే.. దేశవాళీలో ఇటీవల నిలకడగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Shubman Gill : రోహిత్, కోహ్లీ బాటలోనే గిల్.. కీలక నిర్ణయం..
న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్ – జనవరి 11 (వడోదర)
* రెండో వన్డే మ్యాచ్ – జనవరి 14 (రాజ్ కోట్)
* మూడో వన్డే మ్యాచ్ – జనవరి 18 (ఇండోర్)
