Perth Test Jaiswal and Kohli hit tons India set Australia 534 to win
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. తనకు అచ్చొచ్చిన ఆసీస్ గడ్డపై సెంచరీతో చెలరేగాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో అతడికి ఇది 30వ శతకం. కాగా.. ఆసీస్ గడ్డ పై అతడికి ఇది ఏడో శతకం కావడం విశేషం. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇంతకముందు వరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ ఆసీస్‌లో ఆరు సెంచరీలు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ హాబ్స్ పేరిట ఉంది, అతడు తొమ్మిది శతకాలు బాదాడు. కోహ్లీ, వాల్టర్ హమ్మండ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.
AUS vs IND : హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్
ఇక కోహ్లీ శతకం చేయగానే భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఎదుట 534 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో కోహ్లీతో పాటు యశస్వి జైస్వాల్ (161) భారీ శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్ (77) హాఫ్ సెంచరీ సాధించగా, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (38 నాటౌట్) వేగంగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మిచెల్ స్టార్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది.
Hello Australia 🇦🇺
KING KOHLI has brought up his 7th Test century on Aussie soil and second at the Perth Stadium. A classic knock from the champion batter 🫡🫡
Live – https://t.co/gTqS3UPruo… #AUSvIND | @imVkohli pic.twitter.com/QHMm7vrhcw
— BCCI (@BCCI) November 24, 2024