Piyush Chawla among 13 Indians in SA20 auction
SA20 : సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు ఆసక్తి చూపుతున్నారు.
సౌతాఫ్రికా టీ20 (SA20) లీగ్ నాలుగో ఎడిషన్‌కు ముందు నిర్వహించనున్న వేలానికి మొత్తం 13 మంది భారత ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా (Piyush Chawla) సైతం ఉన్నాడు.
అంతేకాదండోయ్ సిద్దార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్ లు సైతం వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
BCCI : ఆసియాకప్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. సపోర్ట్ స్టాఫ్ నుంచి ఒకరు ఔట్..
ఢిల్లీకి చెందిన అనురీత్ సింగ్ కతూరియా, పంజాబ్‌కు చెందిన సరుల్ కన్వర్, గుజరాత్‌కు చెందిన మహేశ్ అహిర్, రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ జగా, యూపీకి చెందిన ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, తమిళనాడుకు చెందిన కేఎస్ నవీన్, రాష్ట్రాల పేర్లు పొందుపరచని అన్సారీ మరూఫ్, మొహమ్మద్ ఫైద్, వెంకటేశ్ గాలిపెల్లి లు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వీరంతా తమ బేస్ ప్రైజ్‌ను రూ.10లక్షలుగా నిర్ణయించుకున్నారు. చావ్లా తన బేస్ ప్రైస్‌ను రూ.50లక్షలుగా నమోదు చేసుకున్నాడు.
సెప్టెంబర్ 9న సౌతాఫ్రికా టీ2025 వేలం జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. మొత్తం 784 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాక్ నుంచి 40 మంది, ఇంగ్లాండ్ నుంచి 150 మంది ఆటగాళ్లు వేలంలో నమోదు చేసుకున్నారు. ఆరు ఫ్రాంచైజీల వద్ద 7.4 మిలియన్ల యూఎస్ డాలర్ల పర్స్ ఉంది. వేలంలో ఫ్రాంఛైజీలు అన్ని కలిపి 84 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.
భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఆడొచ్చా?
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవ్వరూ కూడా విదేశీ లీగుల్లో ఆడకూడదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో పాటు ఐపీఎల్‌తోనూ అనుబంధం పూర్తిగా తెంచుకోవాలి. అంటే.. ఒక్కసారి ఎవరైనా భారత ప్లేయర్ విదేశీ లీగ్ ఆడితే అతడు భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఆడే అర్హతను కోల్పోతాడు.