ICC ODI World Cup-2023: కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారు: గంభీర్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని టీమిండియా ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి తాజాగా గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ICC ODI World Cup-2023: కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారు: గంభీర్

Gautam Gambhir

Updated On : January 6, 2023 / 7:23 PM IST

ICC ODI World Cup-2023: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని టీమిండియా  ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి తాజాగా గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎటువంటి భయమూలేకుండా ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయాలని, అలాగే, అన్ని రకాల ఆటగాళ్లు జట్టులో ఉండాలని చెప్పారు. ఆటకు తగ్గట్లు మారే ఆటగాళ్లు కావాలని అన్నారు. క్రీజులో పరిస్థితులకు తగ్గట్టు ఆడే, స్పిన్ బౌలింగ్ లోనూ రాణించే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు వచ్చే ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.

క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో ఆడే భారత క్రికెటర్లలో ఎవరైనా ఒకవేళ ప్రపంచ కప్ కంటే ముందు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే, వారు టీ20లు, ఐపీఎల్ మ్యాచులు ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అంతేగానీ, వన్డే ఫార్మాట్ మ్యాచులకు దూరంగా ఉండకూడదని చెప్పారు.

ఐపీఎల్ కన్నా ప్రపంచ కప్ లో ఆడేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఐపీఎల్ ప్రతి ఏడాదీ జరుగుతుందని, ప్రపంచ కప్ మాత్రం నాలుగేళ్లకు ఒక్కసారే జరుగుతుందని అన్నారు. ఐపీఎల్ లో గెలవడం కంటే ప్రపంచ కప్ గెలవడం చాలా కీలకమని వ్యాఖ్యానించారు.

Prime Phones Party Sale : అమెజాన్ ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్.. షావోమీ, శాంసంగ్, రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!