బాబర్ ఆజాంతో లవ్‌లో పడ్డ మోడల్.. అబ్బో ఎన్ని మాటలు చెబుతుందో చూడండి..
స్టార్ క్రికెటర్ గురించి ఆమె ఇలా మాట్లాడేసిందేంటి?

పాకిస్థాన్ క్రికెట్ స్టార్ బాబర్ అజాంపై ఓ పాపులర్ మోడల్ మనసు పారేసుకుంది. మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దువా జహ్రా తాజాగా ఆమె బాబర్ ఆజాం గురించి మాట్లాడుతూ.. అతడిపై ఉన్న ప్రేమాభిమానాలను బయటపెట్టింది.
అతడిపై తనకు చాలా లవ్, అఫెక్షన్ ఉన్నాయని దువా జహ్రా చెప్పింది. అయితే, తనకు వివాహానికి ముందే సహజీవనం చేయడం, డేటింగ్ వంటివాటిపై నమ్మకం లేదని తెలిపింది. పెళ్లి బంధంలోనే అసలైన ప్రేమ ఉంటుందని చెప్పింది.
Also Read: బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?
తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన బాబర్ ఆజాంను ఎవరైనా ట్రోల్ చేస్తే తట్టుకోలేనని తెలిపింది. అటువంటివి దయచేసి వద్దని చెప్పింది. దీంతో ఆమెది వన్ సైడ్ లవ్వా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
దువా జహ్రాకు పాకిస్థాన్‌లో బాగా పాపులారిటీ ఉంది. మోడలింగ్‌లో బాగా రాణిస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఆమె సినిమాల్లో ప్రవేశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బాబర్ మాత్రం ప్రముఖ నటి హానీయా ఆమిర్‌తో లవ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కొన్నాళ్లు డేటింగ్ కూడా చేసినట్లు, ఆ తర్వాత విడిపోయినట్లు ప్రచారం జరిగింది.