Premier Handball League : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లోకి ‘తెలుగు టాలన్స్’ ఎంట్రీ.. ప్రారంభ సీజన్ ఎప్పటినుంచంటే?
Premier Handball League : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL) ప్రారంభ ఎడిషన్‌లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజీకి చెందిన తెలుగు టాలన్స్ చేరింది. ఈ జట్టుతో పాటు ఢిల్లీకి చెందిన ఢిల్లీ పంజర్స్ (Delhi Panzers) జట్టు కూడా చేరింది.

Premier Handball League : Delhi Panzers and Telugu Talons Join Inaugural Edition of Premier Handball League
Premier Handball League : భారత్ వేదికగా మొదటిసారి నిర్వహించనున్న (Premier Handball League) ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL) ప్రారంభ ఎడిషన్‌లో తెలుగు టాలన్స్ (Telugu Talons) ఎంట్రీ ఇచ్చింది. మరో జట్టు ఢిల్లీ పంజర్స్ (Delhi Panzers) కూడా PHL లీగ్ ఎడిషన్‌లో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రాంఛైజీకి చెందిన తెలుగు టాలన్స్ ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL)లో ప్రవేశిస్తున్నట్లు ఏప్రిల్ 22 (శనివారం) ప్రకటించింది.
బ్యాడ్మింటన్, వాలీబాల్, గోల్ఫ్ వంటి ఇతర క్రీడా జట్లతో పాటు పలు స్పోర్ట్స్ లీగ్‌లలో సత్తా చాటిన తెలుగు టాలన్స్.. రాబోయే PHL ప్రారంభ ఎడిషన్‌లో ఇతర జట్లతో పోటీపడనుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ (తెలుగు టాలన్స్) జట్టు క్రీడా పారిశ్రామికవేత్త అభిషేక్ రెడ్డి కంకణాల (Abhishek Reddy Kankanala) ప్రాంఛైజీకి చెందినది. అలాగే, ఢిల్లీ (ఢిల్లీ పంజర్స్) జట్టు భండారీ స్పోర్ట్స్‌కు చెందిన వినీత్ భండారీ ఫ్రాంచైజీకి చెందినది.
ఏప్రిల్ 23, 2023న (ఆదివారం) ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్’ వేలం జరుగనుంది. ఇందులో ఒక్కో జట్టులో 11 మంది భారత ఆటగాళ్లు, 3 అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తుంది. అంతకుముందు గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్, గర్విట్ గుజరాత్ జట్లు ఈ లీగ్‌లో చేరాయి.
Read Also : IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే..?
లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో చోటు దక్కిన సందర్భంగా తెలుగు టాలన్స్ పటిష్టమైన జట్టును ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రాంఛైజీ భావిస్తోంది. అయితే, తెలుగు టాలన్స్ జట్టులో పెట్టుబడితో క్రీడను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన అథ్లెట్లను వారి నైపుణ్యాలను పెద్ద వేదికపై ప్రదర్శించడానికి అవకాశం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అభిషేక్ రెడ్డి. అదేవిధంగా, భారత్‌లో క్రీడా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారు.

Premier Handball League _ Delhi Panzers and Telugu Talons Join Inaugural Edition of Premier Handball League
విభిన్న స్పోర్ట్స్ పోర్ట్ ఫోలియోను విస్తరించేందుకు అభిషేక్.. ముఖ్యంగా భారత్‌లో హ్యాండ్ బాల్ కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టిసారించారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ స్పోర్ట్స్ లీగ్‌లలో మునుపటి క్రీడా పెట్టుబడులకు సైతం తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. ‘హ్యాండ్‌బాల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అథ్లెట్లకు సపోర్టుగా నిలబడడం గర్వంగా ఉంది’ అని అభిషేక్ రెడ్డి అన్నారు.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో అత్యున్నత స్థాయిలో పోటీపడేలా తెలుగు టాలన్ జట్టును అభివృద్ధి చేసేందుకు జాతీయంగా, అంతర్జాతీయంగా హ్యాండ్‌బాల్ కమ్యూనిటీకి గర్వంగా ఉందన్నారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ప్రారంభ సీజన్ జూన్ 8న నుంచి ప్రారంభమై జూన్ 25, 2023 వరకు కొనసాగుతుంది. ఈ PHL ప్రారంభ ఎడిషన్ కోసం (viacom18) నెట్‌వర్క్‌లో, జియో సినిమా (Jio Cinema), స్పోర్ట్స్ 18-1 (HD & SD), స్పోర్ట్స్ 18 ఖేల్ (Sports 18 Khel)లో లైవ్ చూడొచ్చు.
Read Also : IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ .. మరోవారం రోజులు జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ ..