Premier Handball League: తెలుగు టాల‌న్స్‌కు భారీ షాక్‌.. ఈ సీజ‌న్‌లో తొలిసారి

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (PHL)లో వ‌రుస విజ‌యాల‌తో దుమ్మురేపిన తెలుగు టాల‌న్స్‌(Telugu Talons)కు షాక్ త‌గిలింది. ఈ టోర్నీలో తొలి సారి ఓట‌మిని చ‌వి చూసింది.

Premier Handball League: తెలుగు టాల‌న్స్‌కు భారీ షాక్‌.. ఈ సీజ‌న్‌లో తొలిసారి

TT vs MI

Updated On : June 12, 2023 / 4:41 PM IST

Premier Handball League 2023: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (PHL)లో వ‌రుస విజ‌యాల‌తో దుమ్మురేపిన తెలుగు టాల‌న్స్‌(Telugu Talons)కు షాక్ త‌గిలింది. ఈ టోర్నీలో తొలి సారి ఓట‌మిని చ‌వి చూసింది. ఆదివారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐర‌న్ మెన్(Maharashtra Ironmen) చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ఆద్యంతం ఇరు జ‌ట్లు నువ్వా నేనా అన్న‌ట్లు పోరాడ‌గా చివ‌రికి 26-30తో నాలుగు గోల్స్ వ్య‌త్యాసంతో విజ‌యానికి దూరమైంది.

డిఫెన్స్‌లో ఇరు జ‌ట్లు గొప్పగా రాణించాయి. దీంతో ఆట ప్రారంభ‌మైన తొలి 30 నిమిషాల వ‌ర‌కు పెద్ద‌గా గోల్స్ న‌మోదు కాలేదు. టాలన్స్‌ గోల్‌కీపర్‌ రాహుల్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం ముగిసే సమయానికి తెలుగు టాలన్స్‌ 14-12తో రెండు గోల్స్ తేడాతో ముందంజ‌లో నిలిచింది. ద్వితీయార్థంలోనూ కొంత సేపు వ‌ర‌కు జోరు కొన‌సాగించిన టాల‌న్స్ ఆ త‌రువాత ప‌ట్టు స‌డ‌లించింది.

Premier Handball League: తెలుగు టాల‌న్స్ జెర్సీ ఆవిష్క‌ర‌ణ‌.. కెప్టెన్ ఎవ‌రంటే..?

PHL

PHL

ఐరన్ మ్యాన్‌ స్టార్ ఆటగాడు అంకిత్‌ కుమార్‌ 9 గోల్స్‌ నమోదు చేసి త‌న‌ జ‌ట్టును ముందంజ‌లో నిలిపాడు. 21-23, 24-26తో ఆఖరు వరకు ఇరు జ‌ట్ల‌తో విజ‌యం దోబూచులాడింది. ఆఖ‌రికి తెలుగు టాలన్స్‌ సీజన్లో తొలి పరాజ‌యాన్ని చ‌విచూసింది. తెలుగు టాలన్స్ జ‌ట్టులో నసీబ్‌ సింగ్‌ పది గోల్స్ చేసిన‌ప్ప‌టికి ఓట‌మి త‌ప్ప‌లేదు.