PSL 2025 : శ‌నివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్.. మ‌రి పీఎస్ఎల్ సంగ‌తేంటి? పీసీబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

పాకిస్థాన్‌ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2025 ను పునఃప్రారంభించ‌డానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స‌న్నాహ‌కాలు చేస్తోంది.

Preparations to restart PSL before IPL 2025

పాకిస్థాన్‌ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2025 ను పునఃప్రారంభించ‌డానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స‌న్నాహ‌కాలు చేస్తోంది. భార‌త్‌, పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పీఎస్ఎల్‌ను మ‌ధ్య‌లోనే వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్‌, పాక్‌లు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పీఎస్ఎల్‌ను తిరిగి ప్రారంభించాల‌ని పీసీబీ భావిస్తోంది. మే 16 నుంచి పీఎస్ఎల్‌ను ప్రారంభించాల‌ని చూస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నెలాఖ‌రున బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కన్నా ముందే పీఎస్ఎల్ ఫైన‌ల్‌ను నిర్వ‌హించాల‌ని పీసీబీ భావిస్తోంద‌ని తెలుస్తోంది.

Australia : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే.. బుమ్రా బౌలింగ్‌ను చిత‌క్కొట్టిన యువ ఆట‌గాడికి చోటు..

విదేశీ ఆట‌గాళ్లు వ‌స్తారా రారా అన్న‌దానితో సంబంధం లేకుండానే లీగ్‌ను నిర్వ‌హించాల‌ని అనుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. కొంతమంది విదేశీ ఆటగాళ్ళు ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్నారని, మరికొందరు తమ ఇళ్లకు వెళ్లిపోయారని అంటున్నారు.

ఎన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి?
పీఎస్ఎల్ 2025లో ఫైన‌ల్ మ్యాచ్‌తో స‌హా ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఉండ‌గా.. నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు ఉన్నాయి. షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేందుకు పీసీబీ సిద్ద‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 శ‌నివారం (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. సోమ‌వారం రాత్రి ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది.

SRH : ఓరి నాయ‌నో.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త క‌ష్టం..! కావ్య పాప ఇప్పుడేమి చేస్తుందో?

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ఇదే..

మే 17 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ కేకేఆర్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 18 – రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్‌ పంజాబ్ కింగ్స్ – జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 18 – ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్‌ గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 19 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 20 – చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 21 – ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై (రాత్రి 7:30 గంటలకు)
మే 22 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ లక్నో సూపర్ జెయింట్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)
మే 23 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 24 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 25 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ చెన్నై సూపర్ కింగ్స్ – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 25 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్‌ కేకేఆర్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 26 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ముంబై ఇండియన్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 27 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ ఆర్‌సీబీ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 29 – క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

Virat Kohli-Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల వ‌న్డే భ‌విష్య‌త్తు పై సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌ర‌ట‌..

మే 30 – ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 1 – క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 3 – ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)