Prithvi Shaw : పృథ్వీ షా వీర విహారం.. డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు, 11 సిక్సర్లు.. రీ ఎంట్రీకి సిద్ధం..!

గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీమ్ఇండియా యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) ఎట్ట‌కేల‌కు ఫామ్ అందుకున్నాడు. ఇన్ని రోజుల ప‌రుగుల దాహాన్ని తీర్చుకుంటూ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు.

Prithvi Shaw

Prithvi Shaw double hundred : గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీమ్ఇండియా యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) ఎట్ట‌కేల‌కు ఫామ్ అందుకున్నాడు. ఇన్ని రోజుల ప‌రుగుల దాహాన్ని తీర్చుకుంటూ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. బంతి ప‌డితే ఫోర్‌ లేదంటే సిక్స‌ర్ అన్న‌ట్లుగా బౌండ‌రీల సునామీ సృష్టిస్తూ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స‌ర్ల‌లో 244 ప‌రుగులు చేశాడు.

టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే ల‌క్ష్యంగా పృథ్వీ షా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌లోని దేశ‌వాళీ క్రికెట్‌లో నార్తాంప్టన్ షైర్ త‌రుపున ఆడుతున్నాడు. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో భాగంగా బుధ‌వారం సోమర్‌సెట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా పృథ్వీ చెల‌రేగాడు. షా తుఫాను ఇన్నింగ్స్ కార‌ణంగా ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు అయ్యాయి. సోమ‌ర్ సెట్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన పృథ్వీ ఇన్నింగ్స్‌తో మొద‌ట బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్ షైర్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 415 ప‌రుగులు చేసింది. డొమెస్టిక్ వన్డే కప్ టోర్నీలోనే ఇది అత్యధిక స్కోర్.

World Cup 2023 : వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్ vs పాక్ మ్యాచ్‌ స‌హా 9 మ్యాచుల రీ షెడ్యూల్‌.. టికెట్లు విక్ర‌యించే తేదీలు ఇవే..

81 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్న పృథ్వీ మ‌రో 48 బంతుల్లోనే డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడంటే అత‌డి విధ్వంసం ఏ స్థాయిలో సాగింది అన్న విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో పృథ్వీ ప‌లు రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ టోర్నీలో ఓలీ రాబిన్స‌న్ (206) పేరిట ఉన్న అత్యధిక వ్య‌క్తిగ‌త ప‌రుగుల రికార్డును చెరిపేశాడు. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో ద్విశ‌త‌కం బాదిన మొద‌టి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లోనూ అత్యధిక వ్య‌క్తిగ‌త స్కోరు న‌మోదు చేశాడు. మొత్తంగా పురుషుల లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

ట్రెండింగ్ వార్తలు