Ranji Trophy 2024 : ఇలాంటి మ్యాచుల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌రా..? బీసీసీఐ పై అభిమానుల మండిపాటు

రంజీట్రోఫీలో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

TN vs KAR

Ranji Trophy 2024 -TN vs KAR : రంజీట్రోఫీలో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో త‌మిళ‌నాడు విజ‌యానికి 20 ప‌రుగులు అవ‌స‌రం కాగా క‌ర్ణాట‌క గెల‌వ‌డానికి 2 వికెట్లు కావాల్సి ఉంది. అయితే.. త‌మిళ‌నాడు నాలుగు ప‌రుగులు మాత్ర‌మే సాధించ‌గా.. క‌ర్ణాట‌క వికెట్లు తీయ‌క‌పోవ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క‌ర్ణాటక మొద‌ట బ్యాటింగ్ చేసింది. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (151; 218 బంతుల్లో 12 ఫోర్లు,6 సిక్స‌ర్లు) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో క‌ర్ణాట‌క 366 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ప‌డిక్క‌ల్‌తో పాటు సామ్రాట్ (57), హార్దిక్ రాజ్ (51) అర్ధ‌శ‌త‌కాలు చేశారు. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో అజిత్ రామ్ నాలుగు వికెట్లు తీయ‌గా సాయి కిశోర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం క‌ర్ణాట‌క బౌల‌ర్లు విజయ్‌కుమార్ వైశాఖ్ నాలుగు, శశికుమార్ మూడు వికెట్లతో చెల‌రేగ‌డంతో త‌మిళ‌నాడు మొద‌టి ఇన్నింగ్స్‌లో 151 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో క‌ర్ణాట‌క‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 215 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

Indonesia Footballer : ఇండోనేషియాలో హృద‌య‌విదార‌క‌ర ఘ‌ట‌న‌.. మైదానంలో పిడుగు.. రెప్ప‌పాటులో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ఆట‌గాడు

అయితే.. ఆ త‌రువాత‌ త‌మిళ‌నాడు బౌల‌ర్లు విజృంభించ‌డంతో క‌ర్ణాట‌క రెండో ఇన్నింగ్స్‌లో 139 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో త‌మిళ‌నాడు ముందు 355 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. త‌మిళ‌నాడు బ్యాట‌ర్లు పోరాడ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌భ‌రితంగా మారింది. బాబా ఇంద్రజిత్ (98) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ప్రదోష్ పాల్ (74), విజ‌య్ శంక‌ర్ (60) హాఫ్ సెంచ‌రీలు చేశారు.

త‌మిళ‌నాడు విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. క్రీజులో బౌల‌ర్లు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (7), అజిత్ రామ్ (5) లు ఉండ‌డంతో నాలుగు ప‌రుగులే రావ‌డంతో త‌మిళ‌నాడు రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 338 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. దీంతో మ్యాచ్ డ్రా ముగిసింది.

AUS vs WI : ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే.. క్రికెట్‌లో ర‌నౌట్లు క‌నుమ‌రుగే! ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండ‌రు

నెటిజ‌న్ల మండిపాటు..
అయితే.. రంజీమ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌క‌పోవ‌డంపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇలాంటి అద్భుత మ్యాచ్‌ల‌ను మిస్ అవుతున్నామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు చెపాక్ స్టేడియానికి రావ‌డం విశేషం.

ట్రెండింగ్ వార్తలు