Indonesia Footballer : ఇండోనేషియాలో హృద‌య‌విదార‌క‌ర ఘ‌ట‌న‌.. మైదానంలో పిడుగు.. రెప్ప‌పాటులో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ఆట‌గాడు

ఫుట్‌బాల్ మ్యాచ్ హోరాహోరీగా జ‌రుగుతోండ‌గా మైదానంలో పిడుగు ప‌డి ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయాడు.

Indonesia Footballer : ఇండోనేషియాలో హృద‌య‌విదార‌క‌ర ఘ‌ట‌న‌.. మైదానంలో పిడుగు.. రెప్ప‌పాటులో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ఆట‌గాడు

Footballer Dies After Being Hit By Lightning During A Match In Indonesia

Indonesia Footballer Dead : ఫుట్‌బాల్ మ్యాచ్ హోరాహోరీగా జ‌రుగుతోండ‌గా మైదానంలో పిడుగు ప‌డి ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఆదివారం వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఎఫ్‌బీఐ స‌బంగ్‌, బాండుంగ్ ఫుట్‌బాల్ క్ల‌బ్ జ‌ట్ల మ‌ధ్య ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ జ‌రిగింది. గోల్ సాధించేందుకు ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు హోరాహోరీగా పోటీప‌డుతున్నారు. ఆ స‌మ‌యంలో మైదానంలో ఉన్న స‌బంగ్ ఆట‌గాడిపై ఓ పిడుగు ప‌డింది. దీంతో అత‌డు నిలుచున్న చోటే కుప్ప‌కూలిపోయాడు. ప‌క్క‌న ఉన్న‌ ఆట‌గాళ్లు అత‌డి వ‌ద్ద‌కు వెళ్ల‌గా అచేత‌నంగా క‌నిపించాడు. వెంట‌నే సిబ్బంది అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించాడ‌ని వైద్యులు తెలిపారు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో చురుకుగా, అంద‌రి మ‌ధ్య ఉన్న ఆట‌గాడు ఇక‌లేడ‌ని తెలిసి అత‌డి స‌హ‌చ‌రులు దిగ్బ్రాంతికి గురైయ్యారు.

Also Read: ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే.. క్రికెట్‌లో ర‌నౌట్లు క‌నుమ‌రుగే! ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండ‌రు

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇలాంటి దారుణ ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో బ్రెజిల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫుట్‌బాల్ పిచ్‌పై పిడుగు పడి ఒక ఆటగాడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘ‌ట‌న‌నే ఆగష్టు 2023లో జరిగింది. నికరాగ్వాలోని మనాగ్వాలో పిడుగుపాటుకు యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడు విషాదకరంగా మరణించాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ దురదృష్టవశాత్తు గాయాలతో మరణించాడు.

ఆగస్ట్ 2022లో జార్ఖండ్‌లోని గోమియా జిల్లాలోని హజారీ గ్రామంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పిడుగుపాటుతో 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మృతుడు హజారీ గ్రామానికి చెందిన విశాంత్‌గా గుర్తించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Also Read : వార్న‌ర్ మామ.. నీలో ఈ కళ కూడా ఉందా..