AUS vs WI : ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే.. క్రికెట్‌లో ర‌నౌట్లు క‌నుమ‌రుగే! ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండ‌రు

క్రికెట్‌లో ప్ర‌త్య‌ర్థి వికెట్ తీయ‌డానికి ఆట‌గాళ్లు ఎంతో శ్ర‌మిస్తారు.

AUS vs WI : ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే.. క్రికెట్‌లో ర‌నౌట్లు క‌నుమ‌రుగే! ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండ‌రు

AUS vs WI 2nd T20

AUS vs WI 2nd T20 : క్రికెట్‌లో ప్ర‌త్య‌ర్థి వికెట్ తీయ‌డానికి ఆట‌గాళ్లు ఎంతో శ్ర‌మిస్తారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వికెట్ తీసేందుకే చూస్తుంటారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ చూసి ఉండ‌రు. బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడు. బిగ్ స్ర్కీన్ పై ఈ విష‌యం క‌నిపించింది. అయినా స‌రే అంపైర్‌ ఔట్ ఇవ్వ‌లేదు. నాటౌట్ అంటూ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దీంతో ఫీల్డింగ్ జ‌ట్టు షాక్‌కు గురైంది. ఈ ఘ‌ట‌న ఏదో గ‌ల్లీ క్రికెట్‌లో చోటు చేసుకుంద‌ని మీరు అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచులోనే జ‌రిగింది. అదీ కూడా ఏదో చిన్న జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కూడా కాదు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌టో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 241 ప‌రుగులు చేసింది. ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్‌(120) విధ్వంస‌క‌ర శ‌త‌కంతో చెల‌రేగాడు. టిమ్‌డేవిడ్ (31నాటౌట్‌), మిచెల్ మార్ష్‌(29)లు రాణించారు. వెస్టిండీస్ బౌల‌ర్లో జేస‌న్ హోల్డ‌ర్ రెండు వికెట్లు తీయ‌గా, అల్జారీ జోసెష్‌, రొమారియో షెప‌ర్డ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Kane Williamson : కేన్ విలియ‌మ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌.. మిస్ యూ శాండీ పాప‌

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. 34 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో రొమ్‌మ‌న్ పావెల్ (63) అర్ధ‌శ‌త‌కం చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్‌, స్పెన్స‌ర్ జాన్స‌న్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆడ‌మ్ జంపాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ల‌క్ష్య ఛేద‌న‌లో విండీస్ ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్ ను స్పెన్సర్ జాన్సన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని షాట్ ఆడిన విండీస్ బ్యాట‌ర్ అల్జారీ జోసెఫ్ ప‌రుగు తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. క‌వ‌ర్స్‌లో బంతిని అందుకున్న టిమ్ డెవిడ్ నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న బౌల‌ర్ స్పెన్స‌ర్ జాన్స‌న్‌కు అందించాడు. ఫీల్డ‌ర్ నుంచి బంతి అందుకున్న జాన్స‌న్ వేగంగా వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అప్ప‌టికి అల్జారీ జోసెఫ్ క్రీజును చేరుకోలేదు.

అది క్లియ‌ర్‌గా ఔట్ అని భావించిన జాన్స‌న్‌తో పాటు ఆసీస్ ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకోవ‌డం మొద‌లెట్టారు. ఈ ఆనందంలో అప్పీల్ చేయ‌డం మరిచిపోయారు. దీంతో ఫీల్డ్ అంపైర్ రివ్యూ తీసుకోక‌పోవ‌డంతో పాటు ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఆసీస్ ఆట‌గాళ్లు షాక్‌కు గురైయ్యారు. ఏం జ‌రిగింద‌ని అంపైర్‌ను నిల‌దీయ‌గా అప్పీల్ చేయ‌లేదు అనే విష‌యాన్ని నెమ్మ‌దిగా చెప్పాడు.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

తాను అప్పీల్ చేశానంటూ టిమ్ డేవిడ్ అన‌గా రిప్లేల‌ను ప‌రిశీలించి ఎవ్వ‌రూ అప్పీల్ చేయ‌లేద‌నే విష‌యాన్ని అంపైర్ చూపించాడు. దీంతో చేసేది ఏమీ లేక ఆసీస్ ఆట‌గాళ్లు న‌వ్వుతూ వెళ్లిపోయారు. అప్ప‌టికే ఆసీస్ విజ‌యం ఖాయ‌మైంది. ఈ క్ర‌మంలో అల్జారీ జోసెఫ్ నాటౌట్‌గా బ్యాటింగ్ చేశాడు.

క్రికెట్ చ‌రిత్ర‌లో అప్పీల్ చేయ‌క‌పోవ‌డంతో బ‌తికిపోయిన ఆట‌గాడిగా జోసెఫ్ రికార్డుల‌కు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆసీస్ ఆట‌గాళ్లు మ‌హానుభావులు, గెలిచాం కాబ‌ట్టి స‌రిపోయింది భ‌య్యా.. లేదంటేనా గొడ‌వ జ‌రిగేవి, ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే క్రికెట్‌లో ర‌నౌట్ అనేవే ఉండ‌వు అంటూ దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించకూడదు.