Rashid Khan : ద‌క్షిణాఫ్రికా పై ఓట‌మి.. కెప్టెన్ ర‌షీద్ ఖాన్ కీల‌క వ్యాఖ్య‌లు..

సెమీ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం అఫ్గాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు

Rashid Khan : ద‌క్షిణాఫ్రికా పై ఓట‌మి.. కెప్టెన్ ర‌షీద్ ఖాన్ కీల‌క వ్యాఖ్య‌లు..

Rashid Khan

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్తాన్ క‌థ ముగిసింది. సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో సెమీ ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చిన ఆ జ‌ట్టు ట్రినిడాడ్ వేదిక‌గా గురువారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాపై అద్భుత విజ‌యాల‌ను సాధించిన అఫ్గాన్ జ‌ట్టు.. కీల‌క సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు పై కనీస పోరాట ప‌టిమ‌ను చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 11.5 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స‌ఫారీ బౌల‌ర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు చిగురుటాకుల్లా వ‌ణికిపోయారు. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో సెమీ ఫైన‌ల్‌లో అత్య‌ల్ప స్కోరు చేసిన జ‌ట్టుగా నిలిచారు. అజ్మ‌తుల్లా(10) మిన‌హా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్‌, షంసీ చెరో మూడు వికెట్లు తీశారు. ర‌బాడ‌, నోకియా లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా 8.5 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి అందుకుంది. రీజా హెండ్రిక్స్ (29నాటౌట్‌), మార్‌క్ర‌మ్‌(23నాటౌట్)లు రాణించారు.

Nitish Reddy : తెలుగు ఆట‌గాడు నితీశ్ రెడ్డికి షాక్‌.. మొన్న ఎంపిక చేశారు.. నిన్న తీసేశారు..!

ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్టం..

సెమీ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం అఫ్గాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. బ్యాట‌ర్ల వైఫ‌ల్య‌మే త‌మ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం అని చెప్పుకొచ్చాడు. ప‌రిస్థితులు ఏ మాత్రం అనుకూలించ‌లేద‌న్నాడు. ఓట‌మిని అంగీక‌రిస్తున్న‌ట్లు తెలిపాడు. ఇది త‌మ‌కు ప్రారంభం మాత్ర‌మేన‌ని అన్నాడు. ఈ మెగాటోర్నీలో ఎన్నో సానుకూల‌త‌లు ఉన్నాయ‌న్నాడు. ఎలాంటి జ‌ట్టునైనా ఓడించ‌గ‌లం అనే న‌మ్మ‌కం, విశ్వాసం ఆట‌గాళ్ల‌లో క‌లిగింద‌న్నాడు.

ఇక ముందు జ‌ర‌గ‌నున్న టోర్నీల్లో మ‌రింత మెరుగ్గా తిరిగి వ‌స్తామ‌న్నాడు. ‘జ‌ట్టుగా మాకు ఇది క‌ఠినమైన రోజు. ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. అయితే.. ఎలాంటి ప‌రిస్థితులైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి. బ్యాట‌ర్లు నిరాశ ప‌రిచారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు చాలా అద్భుత‌మైన బంతులు వేశారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ముజీబ్‌కు గాయ‌మైంది. అయిన‌ప్ప‌టికీ మా పేస‌ర్ల‌తో పాటు న‌బీ లు కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో స్పిన్న‌ర్ల ప‌ని తేలికైంది. ఈ టోర్నీలో నిల‌క‌డైన బౌలింగ్ చేశాం.’ అని ర‌షీద్ అన్నాడు.

0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !