Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డే క్రికెట్‌లో అఫ్గాన్ ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
వన్డేల్లో రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

Rashid Khan Creates History become first Afghanistan bowler to complete 200 wickets in ODIS
Rashid Khan : అఫ్గానిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గానిస్తాన్ తరుపున 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుధవారం అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓ వికెట్ తీయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రషీద్ (Rashid Khan)మూడు వికెట్లు తీశాడు.
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన అఫ్గానిస్తాన్ బౌలర్లు వీరే..
* రషీద్ ఖాన్ – 115 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు
* మహ్మద్ నబీ – 174 మ్యాచ్‌ల్లో 176 వికెట్లు
* దవ్లత్ జద్రాన్ – 82 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు
* ముజీబ్ ఉర్ రెహ్మాన్ – 75 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు
* గుల్బదిన్ నైబ్ – 89 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు
అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో..
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో రషీద్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు సక్లయిన్ ముస్తాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ముస్తాక్ 104 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీయగా.. రషీద్ 115 మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.
𝐀 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐇𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐟𝐨𝐫 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 𝐊𝐡𝐚𝐧! 💯💯@rashidkhan_19 completes 200 wickets in ODIs and becomes the first Afghan to reach the milestone. He completed the feat in his 115th game and became the 6th quickest bowler in terms… pic.twitter.com/B3uILl3lRB
— Afghanistan Cricket Board (@ACBofficials) October 8, 2025
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా)200 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ నాలుగో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
* మిచెల్ స్టార్క్ – 102 ఇన్నింగ్స్‌ల్లో
* మహ్మద్ షమీ – 103 ఇన్నింగ్స్‌ల్లో
* సక్లయిన్ ముస్తాక్ – 104 ఇన్నింగ్స్‌ల్లో
* ట్రెంట్ బౌల్ట్ – 107 ఇన్నింగ్స్‌ల్లో
* రషీద్ ఖాన్ – 107 ఇన్నింగ్స్‌ల్లో
Yashasvi Jaiswal : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించే అవకాశం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 221 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహిది హసన్ మీరాజ్ (60), తోహిద్ హ్రిడోయ్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, అజ్మతుల్లా లు చెరో మూడు వికెట్లు తీశారు. ఘజన్‌ఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ తరువాత 222 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహమత్ షా (50)లు హాఫ్ సెంచరీలు బాదగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (40), హష్మతుల్లా షాహిది (33 నాటౌట్)లు రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు తీశాడు.