MS Dhoni: ఇప్పటి వరకూ ధోనీ ఫోన్ నెంబర్ రవిశాస్త్రి దగ్గర లేకపోవడానికి కారణం

2014 నుంచి 2019వరకూ ధోనీతో కలిసి పనిచేసిన రవిశాస్త్రి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. అతని ఫోన్ నెంబర్ చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే..

MS Dhoni: ఇప్పటి వరకూ ధోనీ ఫోన్ నెంబర్ రవిశాస్త్రి దగ్గర లేకపోవడానికి కారణం

Ravi Sastri

Updated On : January 28, 2022 / 7:41 AM IST

MS Dhoni: కొన్నేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో టఫ్ క్రికెటర్ గానే కాకుండా.. బెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. 2019 వరల్డ్ కప్ తర్వాత ఏ మ్యాచ్ లలోనూ కనిపించకుండా ఒక్కసారిగా రిటైర్మెంట్ బాంబు పేల్చాడు. ధోనీ ఎప్పుడు ఏది ఎలా ప్లాన్ చేస్తాడో అతనొక్కడికే తెలుసు అంటుంటారు టీమ్మేట్స్.

దీని గురించి 2014 నుంచి 2019వరకూ ధోనీతో కలిసి పనిచేసిన రవిశాస్త్రి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. అతని ఫోన్ నెంబర్ చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుందట. ఆ జాబితాలో తాను లేనని చెప్తున్నాడు రవి.

‘అతను ఫోన్ లేకుండా గడపాలనుకుంటే అలాగే ఉండగలడు. నిజంగా ఇప్పటివరకూ అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. అడగలేదు కూడా. అతనితో టచ్ లో ఉండాలంటే అదెలాగే ముందు తెలుసుకోవాలి’

Read Also: ఇక నుంచి సూపర్ మార్కెట్లలోనే మద్యం కొనుగోలు

‘ఎమ్మెస్ లాంటి ప్లేయర్ ను నేనెప్పుడూ చూడలేదు. అది సున్నా కానీ 100 కానీ.. వరల్డ్ కప్ గెలిచినా, ఓడినా ఏ మాత్రం తేడా ఉండదు. చాలా మంది ప్లేయర్లను చూశా. సచిన్ లాంటి వ్యక్తిలో కూడా ఫెంటాస్టిక్ టెంపర్మెంట్ చూశాను. కానీ, ధోనీలో అలా ఎప్పుడూ చూడలేదు. అది అతనికి అసలు విషయమే కాదు’ అని చెప్పాడు రవిశాస్త్రి.

ధోనీ, శాస్త్రి చివరిసారిగా 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కలిసి పనిచేశారు. శాస్త్రి హెడ్ కోచ్ గా, ధోనీ టీమ్ మెంటార్ గా వ్యవహరించారు.