Ravichandran Ashwin Comments over Shubman Gill Press Conferences
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి విజయాన్ని అందుకున్నాడు శుభ్‌మన్ గిల్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ నిలిచాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్‌కు ముందు.. ఓ విలేకరి టీమ్ఇండియా శక్తి సామర్థ్యాలను ప్రశ్నించాడు. విజయం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదరు రిపోర్టర్ కనబడపోవడంతో గిల్ సరదాగా అతడు ఎక్కవ అంటూ అడగడంతో అక్కడ నవ్వులు విరిశాయి. కెప్టెన్ అయిన తరువాత మైదానంలోనే కాకుండా ప్రెస్ కాన్ఫరెన్సుల్లోనూ గిల్ వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. అతడు ఎక్కడా ‘షో’ చేస్తున్నట్లుగా లేదన్నాడు. తన అద్భుతమైన నైపుణ్యంతో భారత జట్టును నడిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. “శుభ్‌మన్ గిల్‌కు సహజమైన నైపుణ్యం ఉంది. నేను అతని ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నాను. అతడు షో చేస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఎలా మాట్లాడాలని అనుకుంటున్నాడో అలాగే మాట్లాడుతున్నాడు. అది అతడి సహజ స్వభావం. తన నైపుణ్యాలతో జట్టును నడిపిస్తున్న తీరు బాగుంది.” అని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.
విదేశీ మీడియా ప్రత్యర్థి కెప్టెన్లను ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో లక్ష్యంగా చేసుకుని వారిపై ఎలా దాడి చేస్తుందో అశ్విన్ వివరించాడు. విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్లను అక్కడి మీడియా లక్ష్యంగా చేసుకుంటుంది.
MLC 2025 : ఎంఐ న్యూయార్క్‌ను గెలిపించిన ట్రెంట్ బౌల్ట్.. ఎలిమినేటర్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓటమి..
ఎందుకంటే కెప్టెన్‌ను ఇబ్బంది పెడితే మిగిలిన జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీంతో తమ జట్టు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుందనే అక్కడి వారి భావన అని అశ్విన్ అన్నాడు. అయితే.. గిల్ మాత్రం మీడియాను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడని చెప్పాడు.