Vaibhav Suryavanshi : వార్నీ.. మన దగ్గరే కాదు.. ఇంగ్లాండ్‌లోనూ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 6 గంటలు..
ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.

Vaibhav Suryavanshi Mania 2 Fan Girls Drive 6 Hours Just To Meet him
ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ కుర్రాడిని వేలంలో దక్కించుకోవడమే కాదు తుది జట్టులోనూ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది రాజస్థాన్ రాయల్స్. ఇక తనకు వచ్చిన అవకాశాలను చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు వైభవ్. ఐపీఎల్‌లో రికార్డు శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ కుర్రాడిపై పడింది.
ఇక అతడి ఆటకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ అతడికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇక యూత్ వన్డే టోర్నీ కోసం భారత్ అండర్-19 జట్టు తరుపున ఇంగ్లాండ్‌కు వెళ్లాడు వైభవ్. అక్కడ జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియా బౌలింగ్ కాంబినేషన్ పై రిషబ్ పంత్ హింట్..
కాగా.. వైభవ్ ఇంగ్లాండ్‌కు వచ్చాడు అన్న విషయం తెలిసిన ఇద్దరు మహిళా అభిమానులు అతడిని కలిసేందుకు ఎకంగా 6 గంటలు పైగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆన్య, రివా అనే ఇద్దరు అమ్మాయిలు వైభవ్‌తో ఫోటో దిగేందుకు ఈ సాహసం చేశారు.
Proof why we have the best fans 🫡
🚗 Drove for 6 hours to Worcester
👚 Wore their Pink
🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE
— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025
ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వైభవ్‌తో వారిద్దరు దిగిన ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోల్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆర్ఆర్ జెర్సీలను ధరించి ఉన్నారు. వైభవ్ కంటే పెద్దవాళ్లైన ఆన్య, రివాకు ఇది గుర్తుండిపోయే రోజు అని ఆర్ఆర్ రాసుకొచ్చింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో టోర్నీని ముగించింది.