ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియా బౌలింగ్ కాంబినేష‌న్ పై రిష‌బ్ పంత్ హింట్..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు

ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియా బౌలింగ్ కాంబినేష‌న్ పై రిష‌బ్ పంత్ హింట్..

Rishabh Pant press confference ahead of Lords Test

Updated On : July 10, 2025 / 10:09 AM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. హెడింగ్లీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్చాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఈ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ సెంచ‌రీలు చేశాడు. ఇక రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 65 ప‌రుగులతో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌ల్లో 342 పరుగులు చేశాడు.

లార్డ్స్ వేదిక‌గా నేటి (జూలై 10) నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో రిష‌బ్ పంత్ పాల్గొన్నాడు. మూడో టెస్టులో తాము ఎలాంటి బౌలింగ్ కాంబినేష‌న్‌లో బ‌రిలోకి దిగుతామ‌నే విష‌య‌మై చిన్న హింట్ ఇచ్చాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదిక‌గా మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ను ఊరిస్తున్న కెరీర్ మైల్‌స్టోన్‌..

శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలోని భార‌త్ తొలి టెస్టు మ్యాచ్‌లో న‌లుగురు పేస‌ర్లు, ఓ స్పిన్న‌ర్‌తో బ‌రిలోకి దిగింది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో న‌లుగురు పేస‌ర్లు రెండో టెస్టు మ్యాచ్‌లో న‌లుగురు పేస‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో ఆడింది. ఇక మూడో టెస్టులో ఎలాంటి కాంబినేష‌న్ ఉంటుంద‌నే దానిపై పంత్‌కు ప్ర‌శ్న ఎదురైంది.

పంత్ స్పందిస్తూ జ‌ట్టు యాజ‌మాన్యం త్వ‌ర‌లోనే దీనిపై తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పాడు. ముగ్గురు పేస‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో లేదంటే ముగ్గురు సీమ‌ర్లు, ఓ స్పిన్న‌ర్‌తో ఆడొచ్చున‌ని చెప్పాడు. ఇక మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లోకి ఆధిక్యంలోకి వెళ్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియాకు బెన్‌స్టోక్స్ వార్నింగ్‌.. అదంతా రెండేళ్ల కింద ముచ్చ‌ట‌.. ఇప్పుడెందుకు..

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్.. తొలి మ్యాచ్‌లో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతానికి సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. ఇక లార్డ్స్ మైదానంలో భార‌త రికార్డు ఏమంత గొప్ప‌గా లేదు. ఇక్క‌డ 19 టెస్టులు ఆడ‌గా మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది.