ENG vs IND : ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ను ఊరిస్తున్న కెరీర్ మైల్‌స్టోన్..
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్‌ను కెరీర్ మైల్‌స్టోన్ ఊరిస్తోంది.

ENG vs IND 3rd test KL Rahul Eye on the 9000 international runs
లండన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ 199 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రాహుల్ ఈ మైలురాయి చేరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాహుల్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 217 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 8801 పరుగులు చేశాడు. 60 టెస్టుల్లో 34.58 సగటుతో 3493 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. 85 వన్డేల్లో 49.08 సగటుతో 3043 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 72 టీ20ల్లో 37.75 సగటుతో 2265 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.
ఇక ఇంగ్లాండ్ టూర్‌లోనూ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. రెండు టెస్టుల్లో కలిపి 236 పరుగులు సాధించాడు. తొలి టెస్టులో 42, 137 పరుగులు చేసిన రాహుల్, రెండో టెస్టులో 2, 55 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి భారత్‌కు శుభారంభాలను అందిస్తున్నాడు.
ఇక మూడో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్ మైదానంలో కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడాడు. 152 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.