Ravindra Jadeja : మూడేళ్ల త‌రువాత జ‌డేజా హాఫ్ సెంచ‌రీ..!

ఏకనా స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డి నిల‌బ‌డ్డారు.

Ravindra Jadeja half century : ల‌క్నోలోని ఏకనా స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డి నిల‌బ‌డ్డారు. దీంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా (57 నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అజింక్యా ర‌హానే (36; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) రాణించ‌గా ఆఖ‌ర్లో ధోని (28 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

మూడేళ్ల త‌రువాత..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ల‌క్నో బౌల‌ర్లు షాకిచ్చారు. ర‌చిన్ ర‌వీంద్ర (0)ను మొహ్సిన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయ‌గా కాసేప‌టికే రుతురాజ్ గైక్వాడ్ (17)ను య‌శ్ ఠాకూర్ వెన‌క్కి పంపాడు. దీంతో 33 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చిన జ‌డేజా.. అజింక్యాతో క‌లిసి జ‌ట్టును ఆదుకున్నాడు.

Sanjay Manjrekar : బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేదు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటివ్వండి?

ర‌హానేతో పాటు శివ‌మ్ దూబె (3), స‌మీర్ రిజ్వి(1) లు ఔటైనా మొయిన్ అలీ (20 బంతుల్లో 30 ప‌రుగులు) క‌లిసి జ‌డేజా సమ‌యోచితంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకుంటూనే వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదాడు. ఈ క్ర‌మంలో 32 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా.. ఐపీఎల్ 2021లో జ‌డేజా చివ‌రి సారి హాఫ్ సెంచ‌రీ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు