Richa Ghosh smashes joint fastest fifty in Womens T20I
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున వేగవంతమైన అర్థశతకాన్ని బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును సైతం సమం చేసింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో రిచా ఈ ఘనత అందుకుంది.
కేవలం 18 బంతుల్లోనే రిచా ఘోష్ 50 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రిచా మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 54 పరుగులు చేసింది.
Team India : 2025.. భారత క్రికెట్‌లో రిటైర్‌మెంట్ సంవత్సరం కానుందా..?
మహిళల టీ20ల్లో అత్యంత వేగంగా అర్థశతకాలు చేసిన ప్లేయర్లు..
రిచా ఘోష్ (భారత్) – 18 బంతుల్లో వెస్టిండీస్ పై (2024లో)
సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 18 బంతుల్లో భారత్ పై (2015లో)
ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా) – 18 బంతుల్లో వెస్టిండీస్ పై (2023లో)
నిదా దార్ (పాకిస్థాన్) – 20 బంతుల్లో సౌతాఫ్రికా పై (2019లో)
అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2018లో)
సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2018లో)
ఆలిస్ క్యాప్సీ (ఇంగ్లాండ్) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2023లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(77; 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (54; 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31 నాటౌట్) రాణించారు.
Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మహిళా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడవ..!
అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ విజయంతో భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
Joint-fastest T20I half-century (in women’s cricket) ✅
Fastest T20I half-century for #TeamIndia (in women’s cricket) 🔝
Drop an emoji in the comments below 🔽 to describe that Richa Ghosh blitz 🔥 🔥
Live ▶️ https://t.co/Fuqs85UJ9W#TeamIndia | #INDvWI | @IDFCFirstbank pic.twitter.com/evRpSSXA5G
— BCCI Women (@BCCIWomen) December 19, 2024