Team India : 2025.. భారత క్రికెట్‌లో రిటైర్మెంట్ సంవత్సరం కానుందా..?
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

After Ravichandran Ashwin Floodgates Opened For Big Retirements
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో 537 వికెట్లు తీసి సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. సిరీస్ మధ్యలో అశ్విన్ ఇలా సడెన్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అంతా షాకైయ్యారు. అయితే.. ఇప్పుడు ఓ చర్చ మొదలైంది.
2025 భారత క్రికెట్‌లో రిటైర్మెంట్ సంవత్సరం కానుందని అంటున్నారు. సీనియర్ ఆటగాళ్లు అంతా ఒక్కొక్కరిగా లేదంటే ఒకేసారి రిటైర్‌మెంట్ కావొచ్చునని చెబుతున్నారు. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఒకవేళ భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరుకుంటే.. ఆ మ్యాచ్ తరువాత జట్టులో ఖచ్చితంగా మార్పులు చోటు చేసుకుంటాయట. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
Virat Kohli : యూకేకు షిప్ట్ కానున్న విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో లండన్‌లోనే స్థిరనివాసం..!
ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోకుంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తరువాత జట్టులో మార్పులు చోటు చేసుకోవడం ఖాయమట. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ కావొచ్చునని నివేదిక పేర్కొంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట.
ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేందుకే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఒకేసారి లేదంటే ఒకరి తరువాత మరొకరిగా రిటైర్‌మైంట్ ప్రకటించవచ్చునని అంటున్నారు.
Champions Trophy 2025 : పంతం నెగ్గించుకున్న పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐసీసీ కీలక ప్రకటన..
2008లో సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే ఒకే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నట్లుగానే 2025 భారత క్రికెట్‌లో రిటైర్మెంట్ సంవత్సరం కావచ్చునని కూడా నివేదిక జోడించింది.