Rishabh Pant : మేనేజ‌ర్ ద్వారా ఆర్‌సీబీలోకి రిష‌బ్‌పంత్‌? వికెట్ కీప‌ర్ స్పంద‌న ఇదే..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ సైతం ఢిల్లీని వీడ‌నున్నాడ‌ట‌.

Rishabh Pant slams fan for fake news over potential move to RCB

Rishabh Pant – RCB : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చాలా మంది స్టార్ ఆట‌గాళ్లు తమ జ‌ట్ల‌ను వీడి వేరే జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ సైతం ఢిల్లీని వీడ‌నున్నాడ‌ట‌. అంతేకాదండోయ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)లో చేరాల‌ని పంత్ భావిస్తున్నాడ‌ట‌.

ఈ మేర‌కు ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఇటీవ‌ల పంత్ త‌న మేనేజ‌ర్ ద్వారా ఆర్‌సీబీని సంప్ర‌దించాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ఫ్రాంచైజీలో చేరి జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకోవాల‌ని అనుకున్నాడు. అయితే.. ఆర్‌సీబీ పంత్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. ఎందుకంటే పంత్ బెంగ‌ళూరు జ‌ట్టులోకి రావ‌డం స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీకి ఇష్టం లేదు అని స‌ద‌రు యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.

IND vs BAN : అభిమానులు జ‌ర జాగ్ర‌త్త‌..! పంత్ సిక్స‌ర్‌తో డేంజ‌ర్‌?

దీనిపై పంత్ స్పందించాడు. ఇవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లు అని చెప్పాడు. సోష‌ల్ మీడియాలో ఇలాంటి వార్త‌ల‌ను ఎందుకు వ్యాప్తి చేస్తున్నార‌ని మండిప‌డ్డాడు. ఎలాంటి కార‌ణం లేకుండా ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించ‌వ‌ద్ద‌ని కోరాడు. ఇదే మొద‌టి సారి కాద‌ని, చాలా కాలంగా ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయ‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలివేశాన‌ని అన్నారు. ఇప్పుడు స్పందించాల్సి వ‌చ్చింది. ద‌య‌చేసి ఇక పై ఇలాంటి వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌వ‌ద్ద‌ని కోరారు. స‌రైన స‌మాచారం తెలుసుకోవాల‌న్నారు.

డిసెంబ‌ర్ 2022లో రోడ్డు ప్ర‌మాదానికి పంత్ గురైయ్యాడు. ఆ త‌రువాత కోలుకుని ఐపీఎల్ 2024 సీజ‌న్‌తో మైదానంలో అడుగుపెట్టాడు. 13 మ్యాచ్‌ల్లో 40.54 సగటు, 155.40 స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు. కాగా.. అత‌డి నాయ‌క‌త్వంలో డీసీ ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు చేర‌డంలో విఫ‌లమైంది. 14 మ్యాచుల్లో 7 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో నిలిచింది.

Virat Kohli : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. స‌చిన్ రికార్డు పై క‌న్నేసిన కోహ్లీ.. ఈ రికార్డు కూడా..