Rishabh Pant : కోల్‌క‌తాపై ఘోర ఓట‌మి.. పంత్‌కు రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌డ‌బ‌డుతోంది.

Photo Credit : www. IPLT20.COM

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌డ‌బ‌డుతోంది. నాలుగు మ్యాచుల‌ను ఆడిన ఆ జ‌ట్టు కేవ‌లం ఒక్క మ్యాచుల్లోనే గెలుపొందింది. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. బుధ‌వారం రాత్రి విశాఖ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ జ‌ట్టుకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ సీజ‌న్‌లో రెండో సారి స్లో ఓవ‌ర్ రేటుకు పాల్ప‌డింది. దీంతో కెప్టెన్ రిష‌బ్ పంత్‌తో పాటు ఆ జ‌ట్టు మొత్తానికి జరిమానా ప‌డింది.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత స‌మ‌యంలో త‌మ ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఫైన్ విధించారు. ‘విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు అతనికి జరిమానా విధించబడింది.’ అని బిసిసిఐ అధికారిక ఓ ప్రకటనలో తెలిపారు.

IPL 2024 : ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకో..! స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు

రెండో సారి కావ‌డంతో..
ఈ సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటుకు పాల్ప‌డ‌డం ఇది రెండో సారి కావ‌డంతో కెప్టెన్ పంత్‌కు రూ.24 లక్ష‌లు జ‌రిమానా ప‌డింది. అదే స‌మ‌యంలో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోని ఒక్కొ ఆట‌గాడికి రూ.6ల‌క్ష‌ల జ‌రిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఈ రెండింటిలో ఏది త‌క్కువ అయితే అది) కోత విధిస్తారు. కాగా.. విశాఖ వేదిక‌గా చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్లో ఓవ‌ర్‌ను కొన‌సాగించింది. అప్పుడు పంత్‌కు రూ.12ల‌క్ష‌ల ఫైన్ వేశారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్లో ఏడు వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగులు చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది రెండో అతి పెద్ద స్కోరు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో కేకేఆర్ 106 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

CSK : హైద‌రాబాద్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నైకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. స్వ‌దేశానికి వెళ్లిపోయిన స్టార్ పేస‌ర్‌!

ట్రెండింగ్ వార్తలు