×
Ad

Rising Stars Asia Cup 2025 : కెప్టెన్‌గా జితేశ్ శ‌ర్మ‌.. వైభవ్‌ సూర్యవంశీ, ప్రియాంశ్‌ ఆర్యకి చోటు..

ఖ‌తార్ వేదిక‌గా నవంబర్‌ 14 నుంచి 23 మ‌ధ్య రైజింగ్ స్టార్స్ ఆసియాక‌ప్ 2025 (Rising Stars Asia Cup 2025) టోర్నీ జ‌ర‌గ‌నుంది.

Rising Stars Asia Cup 2025 Jitesh Sharma to lead India A

Rising Stars Asia Cup 2025 : ఖ‌తార్ వేదిక‌గా నవంబర్‌ 14 నుంచి 23 మ‌ధ్య రైజింగ్ స్టార్స్ ఆసియాక‌ప్ 2025 టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భార‌త-ఏ జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. యువ వికెట్ కీప‌ర్ జితేశ్ శ‌ర్మను ఈ టీమ్ కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అత‌డికి డిప్యూటీగా న‌మ‌న్ ధీర్‌ను నియ‌మించింది.

ఈ జ‌ట్టులో టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాంశ్ ఆర్య‌, నెహాల్ వ‌ధేరా, ర‌మ‌ణ్ దీప్ సింగ్‌, సుయాష్ శ‌ర్మ లు చోటు ద‌క్కించుకున్నారు. అభిషేక్‌ పోరెల్‌ సెకెండ్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌గా చోటు దక్కించుకున్నాడు.

Team india : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం.. భారీగా పెరిగిన మ‌హిళా క్రికెట‌ర్ల బ్రాండ్ వాల్యూ!

గుర్జప్నీత్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, విజయ్‌ కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్ లు పేస‌ర్ల విభాగంలో చోటు ద‌క్కించుకోగా, సుయాశ్‌ శర్మ, హర్ష్‌ దూబే లు స్పెష‌లిస్టు స్పిన్న‌ర్లుగా ఎంపిక అయ్య‌రు. గుర్నూర్‌ బ్రార్‌, కుమార్‌ కుషాగ్రా, తనుశ్‌ కోటియన్‌, సమీర్‌ రిజ్వి, షేక్‌ రషీద్‌ల‌ను స్టాండ్‌ బై ఆట‌గాళ్లుగా ఎంపిక చేసింది.

రైజింగ్ స్టార్స్ ఆసియాక‌ప్ 2025 టోర్నీలో (Rising Stars Asia Cup 2025)భార‌త-ఏ జ‌ట్టు గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో భార‌త్‌తో పాటు ఒమన్‌, యూఏఈ, పాకిస్తాన్ ఏ లు పాల్గొన‌నున్నాయి.

Pratika Rawal : అయ్యో ప్ర‌తీకా.. నీకు క‌నీసం ప‌త‌కం కూడా ఇవ్వ‌లేదా.. జ‌ట్టు కోసం 308 ప‌రుగులు చేసినా..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ఏ జట్టు ఇదే..

ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్‌), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), సుయాష్ శర్మ.