Robin Uthappa : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు భారీ షాక్‌.. అరెస్ట్ వారెంట్ జారీ..!

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది

Uthappa Gets Arrest Warrant For Alleged Provident Fund Fraud Case

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి వారెంట్ జారీ చేయ‌డంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని పులకేశినగర్ పోలీసులను ఆదేశించారు.

సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని ఉత‌ప్ప నిర్వ‌హిస్తున్నాడు. ఈ కంపెనీలో ప‌నిచేస్తున్న చాలా మందికి పీఎఫ్ చెల్లించ‌కుండా మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఉద్యోగుల జీతాల్లోంచి పీఎఫ్ క‌ట్ చేసినా వాటిని ఉద్యోగుల ఖాతాలో జ‌మ చేయ‌లేద‌ట‌. ఆ మొత్తం 23ల‌క్ష‌ల 36 వేల 620 రూపాయ‌లు.

Shreyas Iyer : పంజాబ్ కింగ్స్‌కు మాటిచ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌..

దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి దీనిపై పోలీసుల‌కు డిసెంబ‌ర్ 4న లేఖ రాశారు. నోటీసులు జారీ చేసేందుకు ఉత‌ప్ప నివాసానికి పోలీసులు వెళ్ల‌గా.. ప్ర‌స్తుతం అత‌డు ఆ చిరునామాలో ఉండ‌డం లేద‌ని తెలిసింది. దీంతో ఉత‌ప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే.. రాబిన్ ఉత‌ప్ప 2006 నుంచి 2015 వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న కెరీర్‌ళో 46 వ‌న్డేలు, 13 టీ20ల్లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 46 వ‌న్డేల్లో 25.9 స‌గ‌టుతో 934 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 13 టీ20ల్లో 24.9 స‌గ‌టుతో 249 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ‌శ‌త‌కం ఉంది.

Ravichandran Ashwin : అప్పుడు ఇలా చెప్పిఉంటే గుండెపోటు వ‌చ్చేదేమో : అశ్విన్‌

ఇక ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే.. 2008 నుంచి 2022 వ‌ర‌కు ఆడాడు. 205 ఐపీఎల్ మ్యాచుల్లో 27.5 స‌గ‌టుతో 4952 ప‌రుగులు చేశాడు. ఇందులో 27 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.