టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ..! పాండ్యా ఔట్?

హార్దిక్ పాండ్యాకు టీ20 వరల్డ్ కప్ లో చోటుదక్కుతుందా? లేదా అనే అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో

T20 World Cup 2024 : ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. అయితే, టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ జట్టు ఎంపికపై కసరత్తు జరుగుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఆడనుంది. అయితే, జట్టులో ఓపెనర్లుగా ఎవరు వెళ్లాలి.. బౌలర్లు ఎంతమంది ఉండాలి? యువ ప్లేయర్లకు ఎవరికి అవకాశం ఇవ్వాలి.. హార్దిక్ పాండ్యాను తీసుకోవాలా వద్దా అనే విషయాలపై బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. గతవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత్ జట్టు గురించి చర్చించారు.

Also Read : Jos Buttler Century : విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన జోస్ బట్లర్

టీ20 ప్రపంచ కప్ టోర్నీకి భారత్ జట్టును ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. జట్టు సభ్యులను ఎంపిక చేయడానికి ముందు ద్రవిడ్, అగార్కర్, రోహిత్ మధ్య జరిగిన భేటీలో పలు విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ నం.3గా బ్యాటింగ్ కు వస్తాడు. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా పంపించాలని భావిస్తున్నారు. 15మంది సభ్యులతో కూడిన జట్టులో శుభ్‌మన్ గిల్ బ్యాకప్ ఓపెనర్ గా ఉండొచ్చు. యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్ 2024లో అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. 22ఏళ్ల యువ బ్యాటర్ ఏడు మ్యాచ్ లలో మూడు అర్ధసెంచరీలతో సహా 318 పరుగులు చేశాడు. రాబోయే మ్యాచ్ లలోనూ ఫామ్ ను నిలబెట్టుకుంటే అతను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్‌లో హ్యాట్రిక్, సెంచరీ.. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ సరసన సునీల్ సరైన్

హార్దిక్ పాండ్యాకు టీ20 వరల్డ్ కప్ లో చోటుదక్కుతుందా? లేదా అనే అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ముంబై జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై జట్టు పేలువ ప్రదర్శన కనబరుస్తుంది. దీనికితోడు హార్దిక్ పాండ్యాసైతం వ్యక్తిగతంగా బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించలేక పోతున్నాడు. దీంతో హార్దిక్ కు తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ తుది జట్టులో అవకాశం దక్కినా పాండ్యా క్రమం తప్పకుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని టీం మేనేజ్ మెంట్ సూచించే అవకాశం ఉంది.

భారత్ అంచనా వేసిన జట్టు:
రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), రింకు సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జైతే శర్మ/సంజు శాంసన్ (డబ్ల్యుకె), రవి బిష్ణోయ్.

 

ట్రెండింగ్ వార్తలు