Ind vs Ban 1st Test: అశ్విన్ సెంచరీ తరువాత రోహిత్, కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్

అశ్విన్ సెంచరీ తరువాత టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అశ్విన్ సెంచరీ చేయగానే.. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్ మన్ గిల్ ..

Ravichandran Ashwin

Ashwin Century IND vs BAN: బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించి టీమిండియా కేవలం 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్పిన్నర్లు రవిచంద్ర అశ్విన్, జడేజాలు అద్భుత ఆటతీరును కనబర్చారు. అశ్విన్ 112 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా తన టెస్ట్ కెరీర్ లో ఆరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. జడేజా 117 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్ కు 195 పరుగులు రాబట్టారు.

Also Read : IND vs BAN 1st Test : శ‌త‌క్కొట్టిన అశ్విన్‌, జ‌డేజా హాఫ్ సెంచ‌రీ.. తొలి రోజే 330 దాటిన భార‌త స్కోరు

అశ్విన్ సెంచరీ తరువాత టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అశ్విన్ సెంచరీ చేయగానే.. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్ మన్ గిల్ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. హమ్మయ్య బతికించావ్ అశ్విన్.. అంటూ కొందరు నెటిజన్లు పేర్కొన్నగా.. అశ్విన్ ను చూసి బ్యాటింగ్ చేయడం నేర్చుకోండి అంటూ కోహ్లీ, రోహిత్, గిల్ కు సూచిస్తూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : IND vs BAN : లిట‌న్ దాస్‌, రిష‌బ్ పంత్ ల మ‌ధ్య వాగ్వాదం.. ‘ఫీల్డ‌ర్‌ను స‌రిగ్గా త్రో చేయ‌మ‌ను.. నన్నెందుకు కొడుతున్నారు’

అశ్విన్, జడేజా రాణించడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ (56), రోహిత్ శర్మ (6) చేయగా.. శుభమన్ గిల్ (0), కోహ్లీ (6), పంత్ (39), రాహుల్ (16) పరుగులతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. జడేజా (86 బ్యాటింగ్), అశ్విన్ (102 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.