IND vs BAN : లిటన్ దాస్, రిషబ్ పంత్ ల మధ్య వాగ్వాదం.. ‘ఫీల్డర్‌ను సరిగ్గా త్రో చేయమను.. నన్నెందుకు కొడుతున్నారు’
చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ లు తొలి టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి.

IND vs BAN Rishabh Pant and Liton Das fight over overthrow
IND vs BAN 1st test : చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ లు తొలి టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ గట్టి షాక్ ఇచ్చాడు. అతడు వరుసగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి రిషబ్ పంత్ (39) భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 62 పరుగులు జోడించారు. లంచ్ బ్రేక్ అనంతరం కాసేపటికే పంత్ హసన్ మహమూద్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. అయితే.. అంతకముందు బంగ్లాదేశ్ కీపర్ లిటన్ దాస్‌తో పంత్ కు స్వల్ప వాగ్వాదం జరిగింది.
AFG vs SA : 17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 36/7.. వామ్మో ఏంటిది సౌతాఫ్రికా..
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. తస్కిన్ అహ్మద్ ఈ ఓవర్‌ను వేశాడు. మూడో బంతికి యశస్వి జైస్వాల్ షాట్ కొట్టాడు. సింగిల్ కోసం పరిగెత్తాడు. రిషబ్ పంత్ స్ట్రైకింగ్ ఎండ్‌కు పరుగెత్తుకుంటూ వస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి పంత్‌ను ప్యాడ్లను తాకింది. మరో పరుగు కోసం యత్నించి ఆగిపోయాడు. ఆ సమయంలో లిటన్‌దాస్ పై రిషబ్ పంత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.
‘ఫీల్డర్‌ను సరిగ్గా త్రో చేయమను.. నన్నెందుకు కొడుతున్నారు .’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక లిటన్ దాస్ సైతం ఏదో అంటూ తన కీపింగ్ పొజినష్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్షన్?
ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. యశస్వి (52), కేఎల్ రాహుల్ (14) లు క్రీజులో ఉన్నారు.
Argument between liton das & rishabh pant.
Rishabh : “usko feko na bhai mujhe kyu mar rhe ho” pic.twitter.com/cozpFJmnX3
— PantMP4. (@indianspirit070) September 19, 2024